Hyderabad Weather Alert: ఎండాకాలంలోనూ లేనంత వేడిగా ఇప్పుడు వాతావరణం ఉంది. కానీ ఇలాంటి వాతావరణమే భారీ ఉరుములు, పిడుగలకు కారణం కాబోతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.  తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షం సాయంత్రం నుంచి పడే అవకాశం ఉంది.  బలమైన ఉరుములు, భారీ వర్షాలు, గాలులతో సహా వాతావరణ ఆటంకాలకు సిద్ధంగా ఉండాలని  సలహాలు ఇస్తున్నారు.  

Continues below advertisement

కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉంది.  హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్న సలహాలు నిపుణులు ఇస్తున్నారు.  

Continues below advertisement

  హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు కూడా వర్ష సూచనలు ఉన్నాయి. ఆదిలాబాద్,  కరీంనగర్, మెదక్యాదాద్రి-భువనగిరి,  ములుగు, ఖమ్మం, వరంగల్, నల్గొండ, సూర్యాపేటల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.  తీవ్రమైన ఉరుములు, భారీ వర్షాలు, బలమైన గాలులు, మెరుపులు ఉండవచ్చని అంచనా.  మంగళవారం ప్రారంభమయ్యే వర్షాలు పదహారో తేదీ వరకూ ఉండవచ్చనని చెబుతున్నారు.  

ప్రస్తుతం మండిపోతున్న ఎండలే.. ఉరుముల , మెరుపుల వర్షానికి కారణం అని నిపుణులు చెబుతున్నారు.