DC vs SRH Live Updates: ఎనిమిది వికెట్లతో ఢిల్లీ విజయం.. సన్‌రైజర్స్ దాదాపు ఇంటికే..

IPL 2021, Match 31, DC vs SRH: నేటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసింది.

ABP Desam Last Updated: 22 Sep 2021 10:59 PM
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 17.5 ఓవర్లలో ముగిసేసరికి ఢిల్లీ 139-2.. ఎనిమిది వికెట్లతో విజయం

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్ ఐదు బంతుల్లో 13 పరుగులు చేసి ఢిల్లీ ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది.


శ్రేయాస్ అయ్యర్ 47(41)
రిషబ్ పంత్ 35(21)
జేసన్ హోల్డర్ 3.5-0-33-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 126-2

ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 126-2గా ఉంది. గెలవాలంటే 18 బంతుల్లో 9 పరుగులు చేయాలి.


శ్రేయాస్ అయ్యర్ 40(38)
రిషబ్ పంత్ 30(19)
ఖలీల్ అహ్మద్ 4-0-21-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 110-2

భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 110-2గా ఉంది. గెలవాలంటే 24 బంతుల్లో 25 పరుగులు చేయాలి.


శ్రేయాస్ అయ్యర్ 39(37)
రిషబ్ పంత్ 17(14)
భువనేశ్వర్ 3-0-21-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 99-2

రషీద్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 99-2గా ఉంది. గెలవాలంటే 30 బంతుల్లో 36 పరుగులు చేయాలి.


శ్రేయాస్ అయ్యర్ 37(35)
రిషబ్ పంత్ 8(10)
రషీద్ ఖాన్ 4-0-26-1

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 14 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 96-2

సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 96-2గా ఉంది. గెలవాలంటే 36 బంతుల్లో 39 పరుగులు చేయాలి.


శ్రేయాస్ అయ్యర్ 36(32)
రిషబ్ పంత్ 7(7)
సందీప్ శర్మ 3-0-26-1

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 13 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 85-2

ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 85-2గా ఉంది. గెలవాలంటే 42 బంతుల్లో 50 పరుగులు చేయాలి.


శ్రేయాస్ అయ్యర్ 25(26)
రిషబ్ పంత్ 7(7)
ఖలీల్ అహ్మద్ 3-0-17-1

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 80-2

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు మాత్రమే వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 80-2గా ఉంది. గెలవాలంటే 48 బంతుల్లో 55 పరుగులు చేయాలి.


శ్రేయాస్ అయ్యర్ 22(23)
రిషబ్ పంత్ 5(4)
జేసన్ హోల్డర్ 3-0-20-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 73-2

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. శిఖర్ ధావన్ అవుటయ్యాడు. 11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 73-2గా ఉంది. గెలవాలంటే 54 బంతుల్లో 62 పరుగులు చేయాలి.


శ్రేయాస్ అయ్యర్ 17(18)
రిషబ్ పంత్ 0(0)
రషీద్ ఖాన్ 3-0-23-1

శిఖర్ ధావన్ అవుట్

రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి సమద్ చేతికి శిఖర్ ధావన్ చిక్కాడు.
శిఖర్ ధావన్ (సి)అబ్దుల్ సమద్ (బి) రషీద్ ఖాన్ (42: 37 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్)

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 69-1

సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 69-1గా ఉంది. గెలవాలంటే 60 బంతుల్లో 66 పరుగులు చేయాలి.


శ్రేయాస్ అయ్యర్ 17(18)
శిఖర్ ధావన్ 41(34)
సందీప్ శర్మ 2-0-15-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 60-1

రషీద్ ఖాన్ ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 60-1గా ఉంది. గెలవాలంటే 66 బంతుల్లో 75 పరుగులు చేయాలి.


శ్రేయాస్ అయ్యర్ 16(16)
శిఖర్ ధావన్ 33(30)
రషీద్ ఖాన్ 2-0-19-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 51-1

సందీప్ శర్మ చేతికి విలియమ్సన్ బంతిని అందించాడు. ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 51-1గా ఉంది. గెలవాలంటే 72 బంతుల్లో 84 పరుగులు చేయాలి.


శ్రేయాస్ అయ్యర్ 8(12)
శిఖర్ ధావన్ 32(28)
సందీప్ శర్మ 1-0-6-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: ఏడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 45-1

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. ఏడో ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 45-1గా ఉంది. గెలవాలంటే 78 బంతుల్లో 90 పరుగులు చేయాలి.


శ్రేయాస్ అయ్యర్ 7(11)
శిఖర్ ధావన్ 27(23)
జేసన్ హోల్డర్ 2-0-13-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 39-1

మ్యాజికల్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్లో పది పరుగులు వచ్చాయి. ఆరో ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 39-1గా ఉంది. గెలవాలంటే 84 బంతుల్లో 96 పరుగులు చేయాలి.


శ్రేయాస్ అయ్యర్ 6(9)
శిఖర్ ధావన్ 22త(19)
రషీద్ ఖాన్ 1-0-10-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: ఐదో ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 29-1

భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఐదో ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 29-1గా ఉంది. గెలవాలంటే 90 బంతుల్లో 106 పరుగులు చేయాలి.


శ్రేయాస్ అయ్యర్ 4(7)
శిఖర్ ధావన్ 14(15)
భువనేశ్వర్ 2-0-10-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: నాలుగో ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 27-1

జేసన్ హోల్డర్ బౌలింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. నాలుగో ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 27-1గా ఉంది. గెలవాలంటే 96 బంతుల్లో 108 పరుగులు చేయాలి.


శ్రేయాస్ అయ్యర్ 3(3)
శిఖర్ ధావన్ 13(13)
జేసన్ హోల్డర్ 1-0-7-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: మూడో ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 20-1

ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. పృథ్వీ షా అవుటయ్యాడు మూడో ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 20-1గా ఉంది. గెలవాలంటే 102 బంతుల్లో 115 పరుగులు చేయాలి.


శ్రేయాస్ అయ్యర్ 0(0)
శిఖర్ ధావన్ 9(10)
ఖలీల్ అహ్మద్ 2-0-12-1

పృథ్వీ షా అవుట్

ఖలీల్ అహ్మద్.. పృథ్వీ షాను అవుట్ చేసి సన్‌రైజర్స్‌కు మొదటి వికెట్ అందించాడు
పృథ్వీ షా (సి) విలియమ్సన్ (బి) ఖలీల్ అహ్మద్ (11: 8 బంతుల్లో, 2 ఫోర్లు)

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: రెండో ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 12-0

భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 12-0గా ఉంది. గెలవాలంటే 108 బంతుల్లో 123 పరుగులు చేయాలి.


పృథ్వీ షా 3(3)
శిఖర్ ధావన్ 9(9)
భువనేశ్వర్ 1-0-8-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: మొదటి ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 4-0

ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 4-0గా ఉంది. గెలవాలంటే 114 బంతుల్లో 131 పరుగులు కావాలి.


పృథ్వీ షా 3(3)
శిఖర్ ధావన్ 1(3)
ఖలీల్ అహ్మద్ 1-0-4-0

ఢిల్లీ ఇన్నింగ్స్ ప్రారంభం

పృధ్వీ షా, శిఖర్ ధావన్ ఢిల్లీ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఖలీల్ అహ్మద్ మొదటి ఓవర్ వేయడానికి సిద్ధం అయ్యాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 20 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 134-9, ఢిల్లీ లక్ష్యం 135 పరుగులు

ఆవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 134-9గా ఉంది. ఢిల్లీ గెలవాలంటే 120 బంతుల్లో 135 పరుగులు కావాలి.


భువనేశ్వర్ 5(3)
ఆవేశ్ ఖాన్ 4-0-27-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 19 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 125-7

రబడ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 125-7గా ఉంది.


రషీద్ ఖాన్ 21(17)
భువనేశ్వర్ 0(0)
కగిసో రబడ 4-0-37-3

సమద్ అవుట్

కాసేపు నిలకడగా ఆడిన సమద్‌ను రబడ అవుట్ చేశాడు. 18.2 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 115-7గా ఉంది.
సమద్ (సి) రిషబ్ పంత్ (బి) కగిసో రబడ 28(21 బంతుల్లో, రెండు ఫోర్లు ఒక సిక్సర్)

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 18 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 111-6

నోర్జే వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 111-6గా ఉంది.


రషీద్ ఖాన్ 11(13)
సమద్ 24(19)
నోర్జే 4-0-12-2

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 17 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 107-6

అవేశ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో పది పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 107-6గా ఉంది.


రషీద్ ఖాన్ 8(8)
సమద్ 23(18)
అవేశ్ ఖాన్ 3-0-19-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 16 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 97-6

అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 97-6గా ఉంది.


రషీద్ ఖాన్ 6(4)
సమద్ 16(15)
అక్షర్ పటేల్ 4-0-21-2

హోల్డర్ అవుట్

అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి జేసన్ హోల్డర్ అవుట్ అయ్యాడు. 15.1 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 90-6గా ఉంది.


జేసన్ హోల్డర్ (సి) పృధ్వీ షా (బి) అక్షర్ పటేల్ 10(9 బంతుల్లో, ఒక సిక్సర్)

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 15 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 90-5

కగిసో రబడ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 90-5గా ఉంది.


జేసన్ హోల్డర్ 10(8)
సమద్ 15(14)
కగిసో రబడ 3-0-23-2

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 14 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 78-5

అశ్విన్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 78-5గా ఉంది.


జేసన్ హోల్డర్ 2(4)
సమద్ 12(11)
రవిచంద్రన్ అశ్విన్ 2.5-0-22-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 13 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 74-5

నోర్జే వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. ఆఖరి బంతికి కేదార్ జాదవ్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. 13 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 74-5గా ఉంది.


సమద్ 10(9)
నోర్జే 3-0-8-2
కేదార్ జాదవ్ (ఎల్బీడబ్ల్యూ)(బి) నోర్జే 3(8)

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 12 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 71-4

అశ్విన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 71-4గా ఉంది.


కేదార్ జాదవ్ 2(4)
సమద్ 8(7)
రవిచంద్రన్ అశ్విన్ 1.5-0-18-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 11 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 66-4

కగిసో రబడ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 66-4గా ఉంది.


కేదార్ జాదవ్ 0(1)
సమద్ 5(4)
కగిసో రబడ 2-0-14-2

మనీష్ పాండే అవుట్

విలియమ్సన్ అవుటైన తర్వాతి ఓవర్లోనే కగిసో రబడకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి మనీష్ పాండే కూడా వెనుదిరిగాడు. 10.1 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 61-4గా ఉంది.


మనీష్ పాండే (సి అండ్ బి) రబడ 17(16 బంతుల్లో, ఒక ఫోర్)

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 61-3

అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. కేన్ విలియమ్సన్ వికెట్ కూడా పడింది. 10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 61-3గా ఉంది.


కేదార్ జాదవ్ 0(0)
మనీష్ పాండే 17(15)
అక్షర్ పటేల్ 3-0-14-1

విలియమ్సన్ అవుట్

రెండు లైఫ్‌లు అందుకున్నప్పటికీ.. కేన్ విలియమ్సన్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హెట్‌మేయర్ చేతికి చిక్కాడు.


కేన్ విలియమ్సన్ (సి) హెట్‌మేయర్ (బి) అక్షర్ పటేల్ 18(26 బంతుల్లో, ఒక ఫోర్)

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 58-2

ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్‌కు కాళ్లు పట్టేయడంతో రెండో బంతి నుంచి అశ్విన్ బౌలింగ్‌కు వచ్చాడు. తన బౌలింగ్‌లో విలియమ్సన్, పాండే చెరో బౌండరీ కొట్టారు. దీంతో ఈ ఓవర్లో ఏకంగా 15 పరుగులు వచ్చాయి.  తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 58-2గా ఉంది.


కేన్ విలియమ్సన్ 17(22)
మనీష్ పాండే 15(13)
మార్కస్ స్టాయినిస్ 1.1-0-8-0
రవిచంద్రన్ అశ్విన్ 0.5-0-8-0

ఓవర్ మధ్యలో స్ట్రాటజిక్ టైం అవుట్

బౌలింగ్ వేస్తున్న స్టోయినిస్ అకస్మాత్తుగా బంతి వేయకుండానే ఆగిపోయాడు. వెంటనే ఫిజియో కూడా గ్రౌండ్‌లోకి వచ్చాడు. దీంతో ఓవర్ మధ్యలోనే స్ట్రాటజిక్ టైం అవుట్‌ను ఢిల్లీ తీసుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 43-2

అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి.  ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 43-2గా ఉంది.


కేన్ విలియమ్సన్ 9(16)
మనీష్ పాండే 10(11)
అక్షర్ పటేల్ 2-0-11-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: ఏడు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 39-2

ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ బౌలింగ్‌కు దిగాడు. ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 39-2గా ఉంది.


కేన్ విలియమ్సన్ 7(15)
మనీష్ పాండే 8(7)
మార్కస్ స్టాయినిస్ 1-0-6-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: ఆరు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 32-2

ఆవేష్ ఖాన్ మళ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. ఆరు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 32-2గా ఉంది.


కేన్ విలియమ్సన్ 6(13)
మనీష్ పాండే 3(3)
ఆవేష్ ఖాన్ 2-0-9-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: ఐదు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 29-2

దక్షిణాఫ్రికా పేస్ కగిసో రబడ చేతికి పంత్ బంతిని ఇచ్చాడు. మొదటి బంతికే సిక్సర్ కొట్టి సాహా అతనికి స్వాగతం పలికాడు. ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 29-2గా ఉంది. అయితే ఈ ఓవర్ చివరి బంతికి సాహా అవుటయ్యాడు.


కేన్ విలియమ్సన్ 6(10)
మనీష్ పాండే 0(0)
కగిసో రబడ 1-0-6-1

సాహా అవుట్

కగిసో రబడ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లిన సాహా.. శిఖర్ ధావన్ చేతికి చిక్కాడు.


వృద్ధిమాన్ సాహా (సి) శిఖర్ ధావన్ (బి) రబడ 18(17 బంతుల్లో, 2 ఫోర్లు, ఒక సిక్సర్)

ఐపీఎల్‌లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న సాహా

రబడ బౌలింగ్‌లో సిక్సర్‌తో సాహా ఐపీఎల్‌లో 2000 పరుగుల మార్కును చేరుకున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: నాలుగు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 23-1

ఏస్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్‌కు వచ్చాడు. మొదటి బంతికే బౌండరీ కొట్టి సాహా అతనికి స్వాగతం పలికాడు. ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 23-1గా ఉంది.


కేన్ విలియమ్సన్ 6(10)
వృద్ధిమాన్ సాహా 12(11)
అక్షర్ పటేల్ 1-0-7-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: మూడు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 16-1

నోర్జే వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 16-1గా ఉంది.


కేన్ విలియమ్సన్ 5(7)
వృద్ధిమాన్ సాహా 6(8)
ఆన్రిచ్ నోర్జే 2-0-5-1

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: రెండో ఓవర్ ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 12-1

ఆవేశ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 12-1గా ఉంది.


కేన్ విలియమ్సన్ 3(4)
వృద్ధిమాన్ సాహా 5(5)
ఆవేష్ ఖాన్ 1-0-6-0

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: మొదటి ఓవర్ ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 6-1

నోర్జే వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 6-1గా ఉంది. డేవిడ్ వార్నర్ డకౌట్‌గా వెనుదిరిగాడు.


కేన్ విలియమ్సన్ 2(3)
వృద్ధిమాన్ సాహా 0(0)
ఆన్రిచ్ నోర్జే 1-0-2-1

వార్నర్ డకౌట్

సన్‌రైజర్స్ హైదరాబాద్ డేంజరస్ ఓపెనర్ ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరాడు. 0.3 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 0-1గా ఉంది.


వార్నర్ (సి) అక్షర్ పటేల్ (బి) నోర్జే (0, 3 బంతుల్లో)

ఆట మొదలైంది

సన్‌రైజర్స్ తరఫున డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా ఓపెనింగ్‌కు వచ్చారు. ఢిల్లీ బౌలర్ ఆన్రిచ్ నోర్జే బౌలింగ్‌కు సిద్ధం అయ్యాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తుదిజట్టు

డేవిడ్‌ వార్నర్‌, వృద్ధిమాన్‌ సాహా(వికెట్ కీపర్), మనీశ్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), కేదార్‌ జాదవ్‌, అబ్దుల్‌ సమద్‌, జేసన్‌ హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్ అహ్మద్, సందీప్‌ శర్మ

ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు

పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ పంత్‌ (కెప్టన్, వికెట్ కీపర్), మార్కస్ స్టాయినిస్‌, షిమ్రాన్ హెట్‌మైయిర్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, కాగిసో రబాడా, ఆన్రిచ్‌ నార్జ్‌, అవేశ్‌ ఖాన్‌

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Background

ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. వీటిలో ఢిల్లీ ఆరు విజయాలు సాధించి దుమ్మురేపుతోన్న జట్టు కాగా,ఆరు అపజయాలతో ఆఖర్లో నిలబడిన జట్టు సన్‌రైజర్స్. ఈ మ్యాచ్ విజయం సాధించి ప్లేఆఫ్స్‌‌కు మరింత దగ్గర కావాలనేది పంత్ సేన పంతం కాగా, నిలవాలంటే ప్రతి గెలవాల్సిందేనన్న పట్టుదల కేన్ విలియమ్సన్ బృందానిది.


గత రెండేళ్లుగా తిరుగులేని ఆటతీరుతో సాగుతోంది ఢిల్లీ. ఈసారి ఎలాగైనా తొలి టైటిల్‌ అందుకోవాలని పట్టుదలతో ఉంది. తొలి దశ ముగిసే సమయానికి 8 మ్యాచుల్లో 6 గెలిచింది. మరోవైపు 2016 విజేతైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. తొలి దశలో ఏడు మ్యాచులాడి ఆరు ఓడి 2 పాయింట్లతో అట్టడుగున నిలిచింది.


అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం ఢిల్లీపై సన్‌రైజర్స్‌దే పైచేయి. ఈ రెండు జట్లు 19 సార్లు తలపడగా 11 సార్లు హైదరాబాదే గెలిచింది. ఢిల్లీ ఏడుసార్లు మాత్రమే విజయం అందుకుంది. అయితే చివరి ఐదు మ్యాచుల్లో మాత్రం ఢిల్లీ కాస్త మెరుగైంది. మూడింట్లో గెలిచింది. ప్రస్తుతం ఏ రకంగా చూసిన దిల్లీయే పటిష్ఠంగా కనిపిస్తోంది. సీజన్‌ మొదటి దశలో పవర్‌ప్లేలో ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా రెచ్చిపోయారు. రెండేళ్ల నుంచి పంత్‌ స్ట్రైక్‌రేట్‌ తగ్గినా పరిణతి కనిపిస్తోంది. స్టాయినిస్‌, స్మిత్‌, హెట్‌మైయిర్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ వరకు బ్యాటింగ్‌ చేయగల సత్తా ఉంది. ఇక అవేశ్‌ ఖాన్‌, ఆన్రిచ్‌ నార్జ్‌, రబాడా, అశ్విన్‌, అక్షర్‌, స్టాయినిస్‌ బౌలింగ్‌కు తిరుగులేదు. 


సీజన్‌ ఆరంభంతో పోలిస్తే సన్‌రైజర్స్‌ మరింత పేలవంగా మారడం బాధాకరం. ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టో దుబాయ్‌కి రాలేదు. మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తొలగించిన డేవిడ్‌ వార్నర్‌ ఎంత వరకు ఆడతాడో చెప్పలేని పరిస్థితి. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ పైనే సన్‌రైజర్స్ ఆశలన్నీ పెట్టుకుంది. మిడిలార్డర్‌లో మనీశ్‌ పాండే, అబ్దుల్‌ సమద్‌, కేదార్‌ జాదవ్‌ ఉన్నారు. పేపర్‌పై పేర్లు కనిపిస్తున్నా.. నమ్మకం తక్కువే. టి.నటరాజన్‌ కరోనాతో మ్యాచ్‌కు దూరం అయ్యాడు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.