క్రికెట్‌ బృంద క్రీడ. వ్యక్తులు సమష్టిగా ఆడితేనే విజయాలు దొరుకుతాయి. వ్యక్తిగత మెరుపులకు అభిమానులు మురిసిపోయినా.. ఆ మెరుపులు జట్టు విజయానికి ఉపయోగపడుకుంటే ఏ ఆటగాడైనా బాధపడతాడు. ఐపీఎల్‌లో 2018 నుంచి ఐదుగురు క్రికెటర్లు ఈ నొప్పిని ఎక్కువే అనుభవించారు. వారే..!


Also Read: చితక బాదుడు 'సీక్రెట్‌' చెప్పిన మాక్సీ! బెంగళూరు అలా చెప్పడం వల్లే!


కేఎల్‌ రాహుల్‌: పంజాబ్‌ కింగ్స్‌ సారథి రాహుల్‌ది భిన్నమైన పరిస్థితి. చిన్న చిన్న మూమెంట్స్‌ ఒడిసిపట్టకపోవడంతో ఆ జట్టు గెలిచే మ్యాచుల్లో ఓటమి పాలవుతుంది. అందులో రాహులే ఎక్కువ పరుగులు చేశాడు. 2018 నుంచి అతడు వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. ఏకంగా 2,450 పరుగులు చేశాడు. అందులో 1223 పరుగులు ఓటమి పాలైన మ్యాచుల్లోనే చేయడం గమనార్హం.


Also Read: ఢిల్లీతో చెన్నై ఢీ.. గెలిచినవాళ్లకే టాపర్లయ్యే అవకాశం!


రిషభ్‌ పంత్‌: ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు. కొన్నేళ్లుగా అతడు జట్టుకు ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా ఉంటున్నాడు. 2018 నుంచి సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. కష్టతరమైన మ్యాచుల్లో పరుగుల వరద పారించాడు. ఈ నాలుగేళ్లలో 1852 పరుగులు చేయగా అందులో ఓడిన మ్యాచుల్లో చేసినవే 917 ఉన్నాయి.


మయాంక్‌ అగర్వాల్‌: పంజాబ్‌కు మారిన తర్వాత మయాంక్‌ రాత మారిపోయింది. ఓపెనర్‌గా తనదైన ముద్ర వేశాడు. దంచికొడుతున్నాడు. 2018 నుంచి 1305 పరుగులు చేయగా అందులో 894 ఓటమి పాలైన మ్యాచుల్లోనే చేశాడు. ఈ సీజన్లోనూ అతడు మెరుగ్గా రాణిస్తున్న జట్టు మాత్రం సమష్టిగా విఫలమవుతోంది.


Also Read: ప్లేఆఫ్స్‌కు కన్ఫర్మ్ అయిన మూడు జట్లూ ఇవే.. నాలుగో స్థానం కోసం!


మనీశ్‌ పాండే: తనదైన రోజున మనీశ్‌ పాండేకు తిరుగుండదు. ఐపీఎల్‌లో అతడు నిలకడగానే పరుగులు చేశాడు. సన్‌రైజర్స్‌కు వచ్చాక కాస్త దూకుడు తగ్గింది. ఈ నాలుగేళ్లలో అతడు 1276 పరుగులు చేయగా అందులో 883 ఓడిన మ్యాచుల్లోనే చేశాడు. ఈ ఏడాది అతడికి కేవలం ఏడు మ్యాచుల్లోనే అవకాశం రావడం గమనార్హం. 


విరాట్‌ కోహ్లీ: పరుగులు చేసినా జట్టు ఓడిపోతే ఎంత బాధగా ఉంటుందో విరాట్‌ కోహ్లీకి మించి ఎవరికీ తెలియదు! బెంగళూరు కోసం అతడు టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. కానీ జట్టు అదృష్టం మాత్రం మారేది కాదు. ఈ నాలుగేళ్లలో అతడు 1817 పరుగులు చేయగా అందులో 861 పరుగులు ఓడిన మ్యాచుల్లోనే వచ్చాయి. ఏదేమైనా ఈ సారి బెంగళూరు కప్‌ కొట్టాలని పట్టుదలతో ఉంది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి