ఐపీఎల్‌లో ఇవాళ రెండు మ్యాచ్‌లు ముగిసేసరికి చెన్నై పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానంలోనూ, బెంగళూరు మూడో స్థానంలోనూ, కోల్‌కతా నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. ఈ టేబుల్‌లో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లే టోర్నీలో ముందుకు వెళ్తాయన్న సంగతి తెలిసిందే. చెన్నై, ఢిల్లీ, బెంగళూరు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కాగా.. నాలుగో స్థానం విషయంలో ఉత్కంఠ నెలకొంది.


నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతాకు 12 పాయింట్లు ఉండగా, ఐదో స్థానంలో పంజాబ్, ఆరో స్థానంలో ఉన్న రాజస్తాన్, ఏడో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు పదేసి పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎడ్జ్ కోల్‌కతా వైపే ఉన్నట్లు అనిపించినా.. ఒక్క మ్యాచ్ తేడాలో మొత్తం మారిపోయే అవకాశం ఉంది. మిగతా జట్లు కోల్‌కతాకు పోటీని ఇవ్వాలంటే భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఎందుకంటే కోల్‌కతా నెట్ రన్‌రేట్ చాలా ఎక్కువగా ఉంది.


అయితే కోల్‌కతా ముందంజలో ఉందని మిగతా జట్లను లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే 2014లో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే 14.3 ఓవర్లలో 190 పరుగులు చేయాల్సిన దశలో ముంబై ఆ లక్ష్యాన్ని ఛేదించిన విషయాన్ని అంత త్వరగా మర్చిపోలేం. కాబట్టి ఇక్కడ ఏ జట్టునూ తక్కువ అంచనా వేయలేం.


కోల్‌కతా తర్వాతి మ్యాచ్‌లో ఒకవేళ ఓడిపోతే ఆ జట్టు అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి. కాబట్టి తర్వాతి మ్యాచ్‌లో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా భారీ తేడాతో విజయం సాధించడంపైనే కోల్‌కతా దృష్టి పెట్టాలి. కోల్‌కతా ఓడితే మాత్రం మిగతా జట్లకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.


సరిగ్గా చెప్పాలంటే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైనా జరగొచ్చు. మొదటి మూడు స్థానాలు ఫిక్స్ అయిపోయినా.. నాలుగో స్థానానికి మాత్రం విపరీతమైన పోటీ ఉంది. దీనికి తోడు సోమవారం ఢిల్లీ, చెన్నైల మధ్య జరిగే మ్యాచ్ టేబుల్ టాపర్లను నిర్ణయించే అవకాశం ఉంది. రెండు జట్లూ సమాన మ్యాచ్‌లు ఆడి, సమాన విజయాలు సాధించాయి కాబట్టి.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు మొదటి స్థానంలో ఉండేందుకు అవకాశం ఉంటుంది.


Also Read: యాష్‌ తప్పేం చేయలేదు! సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు పెంచుకొనేందుకే అతడిపై విమర్శలు.. గౌతీ సీరియస్‌!


Also Read: విరాట్‌ సరసన స్మృతి మంధాన.. పింక్‌ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్‌ వెళ్లిన పూనమ్‌!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి