ఏం మాయ చేశావే తో మొదలైన ప్రేమ పెళ్లిబంధంతో శాశ్వతం అవుతుందనుకున్నారు. జీవితకాలం సాగాల్సిన ప్రయాణం మధ్యలోనే కంచికి చేరింది. ఇద్దరి మార్గాలు వేర్వేరు అయ్యాయి. గత కొన్ని రోజులుగా దీనిపై విపరీతంగా చర్చ జరిగినా స్పందించని చై-సామ్ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చేశారు. అప్పటి నుంచీ వీళ్ల సోషల్ మీడియా అకౌంట్ పై నెటిజన్ల దృష్టి పడింది. ఏ కొటేషన్ పెట్టినా, ఏమని పోస్ట్ చేసినా దానిపై డిస్కషన్స్ జరిగిపోతున్నాయి. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత విడాకుల ప్రకటన అనంతరం సైలెంట్ అయిపోయింది. అక్టోబర్2న తమ వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన అనంతరం సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టని సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది.
'ఈ ప్రపంచాన్ని నేను మార్చాలనుకుంటే, ముందు నన్ను నేను మార్చుకోవాలి. మనమే అన్ని పనులు చేసుకోవాలి. షెల్ఫ్‌లో ఉన్న దుమ్ము దులపాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మనం చేయాలనుకుంటున్న లక్ష్యాల గురించి కలలు కనొద్దు' అంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చొంది. ఒంటరిగా నిలబడి కలల్ని సాకారం చేసుకుంటా అంటున్న సమంతకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు నెటిజన్లు.
మరోవైపు సామ్ ఇన్ స్టా, ట్విట్టర్ ఖాతాల్లో ఎస్ అనే ఆంగ్ల అక్షరం మాత్రమే ఉండేది. ఇప్పుడు మళ్లీ ‘సమంత’ అని పేరును రాసుకుంది. శనివారం సామ్ తన భర్తతో విడిపోయినట్టు ప్రకటించింది. ఆ మరుసటి రోజే అంటే ఆదివారమే తన పేరును మార్చింది. పెళ్లికి ముందు ‘సమంత రుత ప్రభు’ అని ఉండేది. చైతూని పెళ్లి చేసుకున్నాక సమంత అక్కినేనిగా మార్చుకుంది. ఆ బంధాన్ని అధికారికంగా తెంచుకోవడానికి ముందే ఆమె అక్కినేనిని తన పేరునుంచి తొలగించింది. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులగానే కొనసాగుతామని చెప్పుకొచ్చారు చై-సామ్. ఇన్ స్టాలో చాలా యాక్టివ్ గా ఉండే సామ్, ఫేస్ బుక్ లో మాత్రం చురుగ్గా ఉండదు. అందుకేనేమో ఇంకా సామ్ ఫేస్ బుక్ ఖాతాలో సమంత అక్కినేనిగానే ఉంది ఆమె పేరు. మరిచిపోయి అలా వదిలేసి ఉంటుందని భావిస్తున్నారు అభిమానులు. ఏదైమైనా సామ్-చై విడిపోవడం వారి అభిమానులకు చాలా బాధను మిగిల్చిందనే చెప్పాలి.
ALso Read:సిగరెట్, డ్రగ్స్, డేటింగ్..నేను చేయలేకపోయిన పనులు నా కొడుకు చేయాలి, షారుక్ వీడియో వైరల్
Also Read: పెళ్లి చేసుకోవడానికి ప్రేమ ఒక్కటే సరిపోదు..సామ్ స్నేహితురాలు చిన్మయి పోస్ట్ వైరల్
Also Read:ఎవరీ ఆర్యన్ ఖాన్.. మార్షల్ ఆర్ట్స్ నుంచి డ్రగ్స్ కేసు వరకు.. స్టార్ కిడ్ ఆసక్తికర విషయాలు
Also Read:బ్రేకప్‌లకు కేరాఫ్ అడ్రస్.. అక్కినేని ఫ్యామిలీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి