అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నారంటూ వచ్చిన వార్తలు నిజమయ్యాయి. ఈ మేరకు వాళ్లిద్దరూ సోషల్ మీడియాలో అఫీషియల్ గా పోస్ట్ పెట్టారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అయ్యో అని కొందరంటే...చైతూకి ఇకపై అంతా మంచే జరుగుతుందని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక సెలెబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. కొందరు సెలబ్రెటీలు కూడా డైరెక్ట్ గా సమంతని ఉద్దేశించి ట్వీట్స్ చేస్తుంటే మరికొందరు చైతూని సపోర్ట్ చేస్తున్నారు. అయితే సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సమంత స్నేహితురాలు చిన్మయి కూడా వీరి సెపరేషన్ పై స్పందిస్తూ పెళ్లికి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఒక్కటే సరిపోదంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
చిన్మయి ఏమందంటే... ‘పెళ్లి చేసుకోవడానికి ముందు.. మీ ఖర్చులు, ఆదాయం, అప్పులు, మతం, అభిరుచులు, ఇష్టాయిష్టాలు, పిల్లల పెంపకంపై అభిప్రాయాలు, చిన్ననాటి భయాలు, కుటుంబంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులు, మానసిక ఆరోగ్యం, కలల నివాసం, కెరీర్, విద్య, రాజకీయాలపై మీకున్న ఆలోచనలు, వైవాహిక జీవితం, జీవిత భాగస్వామిపై మీకున్న అంచనాల గురించి ముందే చర్చించండి. ఎందుకంటే జీవితానికి ప్రేమ ఒక్కటే సరిపోదు కాబట్టి’ అనే సందేశాన్ని షేర్ చేసింది. ఈ పోస్టుపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజమే కదా అని కొందరంటే.. ఇవన్నీ చూసుకుంటే అది బిజినెస్ డీల్ అవుతుంది కానీ పెళ్లి ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తున్నారు మరికొందరు.
ALso Read:సిగరెట్, డ్రగ్స్, డేటింగ్..నేను చేయలేకపోయిన పనులు నా కొడుకు చేయాలి, షారుక్ వీడియో వైరల్
Also Read:ఎవరీ ఆర్యన్ ఖాన్.. మార్షల్ ఆర్ట్స్ నుంచి డ్రగ్స్ కేసు వరకు.. స్టార్ కిడ్ ఆసక్తికర విషయాలు
Also Read:బ్రేకప్‌లకు కేరాఫ్ అడ్రస్.. అక్కినేని ఫ్యామిలీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి