ఐపీఎల్‌లో నేడు సాయంత్రం మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిచినా, ఓడినా సన్‌రైజర్స్‌కు పోయేదేమీ లేదు. అయితే ప్లేఆఫ్స్ వేటలో ఉన్న నైట్‌రైడర్స్‌కు మాత్రం ఈ మ్యాచ్ విజయం తప్పనిసరి. యూఏఈ వచ్చాక కోల్‌కతా ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడింది. అందులో మూడు గెలిచి.. రెండు ఓడింది. సన్‌రైజర్స్ మాత్రం మొత్తం 11 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టాపార్డర్ కీలకం
కోల్‌కతాకు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బీభత్సమైన ఫాంలో ఉన్నారు. శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠిలు బ్యాట్‌తో చెలరేగిపోతున్నారు. ఇన్నింగ్స్‌లో దాదాపు 12 నుంచి 15 ఓవర్లు వీరే ఆడేస్తూ ఉండటంతో.. మిగతా బ్యాట్స్‌మెన్ మీద ఒత్తిడి కూడా తగ్గుతోంది. అయితే కోల్‌కతా మైనస్ కూడా ఇదే. మిడిలార్డర్ పూర్తిగా విఫలం చెందుతోంది. ఇక కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. అతని బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ వచ్చి చాలా కాలం అయింది. ఇక బౌలింగ్ విషయంలో మాత్రం కోల్‌కతా చాలా బలంగా ఉంది. మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, పేస్ బౌలర్ శివం మావి అద్బుతంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులకు అస్సలు అవకాశం ఇవ్వడం లేదు.
Also Read: కోల్‌కతా మ్యాచుకు ముందు పంజాబ్‌కు షాక్! బుడగ వీడిన క్రిస్‌గేల్.. ఎందుకంటే?
కనీసం పోరాడినా చాలు
ఇక సన్‌రైజర్స్ విషయానికి వస్తే.. విజయం మాట పక్కన బెట్టు.. కనీసం పోరాడినా చాలు అనే విధంగా టీం పెర్ఫార్మెన్స్ ఉంది. డేవిడ్ వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన జేసన్ రాయ్.. మొదటి మ్యాచ్‌లో బాగానే ఆడినా.. రెండో మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. కెప్టెన్ విలియమ్సన్ ఆటతీరు కూడా నిలకడగా లేదు. జేసన్ హోల్డర్ ఒక్కడే బ్యాట్‌తోనూ.. బంతితోనూ కాస్త ప్రభావం చూపిస్తున్నాడు.
ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు జరగ్గా.. 13 మ్యాచ్‌ల్లో కోల్‌కతా, ఏడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ విజయం సాధించాయి. మరి ఈ మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచి ప్లే ఆఫ్స్ వైపు అడుగులు వేస్తుందా.. సన్‌రైజర్స్ గెలిచి రైడర్స్ అవకాశాలను గండి కొడుతుందా అనేది నేటి మ్యాచ్‌లో చూద్దాం..
Also Read: యాష్ తప్పేం చేయలేదు! సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకొనేందుకే అతడిపై విమర్శలు.. గౌతీ సీరియస్!
Also Read: విరాట్ సరసన స్మృతి మంధాన.. పింక్ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్ వెళ్లిన పూనమ్!