తన కుమారుడికి సన్‌రైజర్స్ హైదరాబాద్ అవకాశం ఇచ్చినందుకు పేసర్ ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ మాలిక్ సంతోషం వ్యక్తం చేశాడు. మున్ముందు అతడు టీమ్‌ఇండియాకు ఆడాలని కోరుకున్నాడు. తన కుమారుడిని ప్రొషెషనల్ క్రికెటర్‌ను చేసేందుకు ఎంతో కష్టపడ్డామని వెల్లడించాడు. ఐపీఎల్‌లో ఉమ్రాన్ అరంగేట్రం చేసినప్పుడు కన్నీరు ఆగలేదని పేర్కొన్నాడు.
Also Read: ఆఖరి లీగ్ పోరుకు సిద్ధం! చెన్నైపై గెలిచి గౌరవంగా వెళ్లాలనుకుంటున్న పంజాబ్
జమ్ము కశ్మీర్ నుంచి వచ్చిన ఉమ్రాన్ మాలిక్ చక్కని వేగంతో ఆకట్టుకుంటున్నాడు. 145-150 కి.మీ వేగంతో బంతులు విసురుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతడి బంతులను ఆడేందుకు అంతర్జాతీయ బ్యాట్స్‌మెన్ సైతం ఇబ్బంది పడుతున్నారు. అతడి ప్రతిభకు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఫిదా అయ్యారు. వచ్చే వేలంలో అతడు భారీ ధర పలుకుతాడని అంచనా వేస్తున్నారు.
Also Read: సన్‌రైజర్స్ నవ్వింది! థ్రిల్లర్ మ్యాచులో కోహ్లీసేనను ఓడించింది
'మూడేళ్ల వయసు ఉన్నప్పుడే నా కుమారుడు క్రికెట్లో అడుగుపెట్టాడు. ప్రొఫెషనల్ క్రికెటర్ అవ్వాలని అతడు కలగన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం అతడిని ఎంపిక చేసినప్పుడు మాకెంతో సంతోషం కలిగింది. టీవీకి అతుక్కుపోయాం. అతడి ఆట చూస్తుంటే నావి, నా భార్య కళ్లు చెమ్మగిల్లాయి. నా కొడుకు ఎంతో కష్టపడ్డాడు. అతడు ఏదో ఒక రోజు టీమ్‌ఇండియాకు ఆడతాడని మాకు నమ్మకం ఉంది' అని అబ్దుల్ అన్నారు.
Also Read: బాలీవుడ్‌లో అడుగుపెడతారా? ధోనీ ఏం చెప్పాడంటే..!
'మా వరకు ఇదేం చిన్న విషయం కాదు. మాదెంతో పేద కుటుంబం. బతుకుదెరువు కోసం మేం కూరగాయలు, పళ్లు అమ్ముతాం. మా కొడుకు మమ్మల్ని గర్వపడేలా చేశాడు. మా ఆనందానికి హద్దుల్లేవు. జమ్ము లెఫ్ట్‌నెంట్ గవర్నర్ గారూ మా అబ్బాయిని అభినందించారు. కెరీర్లో అతడు మరింత ఎదగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని అబ్దుల్ పేర్కొన్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి