ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆఖరి దశకు చేరుకుంది. ప్రతి జట్టు లీగులో చివరి మ్యాచు ఆడేస్తున్నాయి. గురువారం తొలి మ్యాచులో చెన్నై సూపర్‌కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి. వీరిలో ఎవరు గెలిచినా? ఎవరు ఓడినా? పెద్దగా ప్రభావమేమీ ఉండదు.


Also Read: రాజస్తాన్‌ను చితక్కొట్టిన ఇషాన్ కిషన్.. 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఇండియన్స్!


నామమాత్రమే!
భారత్‌లో దుమ్మురేపిన చెన్నై సూపర్‌కింగ్స్ యూఏఈకి వచ్చిన తర్వాతా అదే జోరు కొనసాగించింది. మొత్తంగా 13 మ్యాచుల్లో 9 గెలిచి 18 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. గత మ్యాచులో ఓటమి ఎదురవ్వడంతో ఆఖరి మ్యాచులో గెలిచి ఆత్మవిశ్వాసంతంతో ప్లేఆఫ్స్‌ ఆడాలన్నది ధోనీసేన వ్యూహం. గెలిచే మ్యాచులను ఓడిపోతూ నిరుత్సాహానికి గురైన రాహుల్‌ సేన కనీసం విజయంతో లీగును ముగించాలని తపన పడుతోంది. ఏదేమైనా చివరి ఐదు మ్యాచుల్లో పంజాబ్‌పై చెన్నై నాలుగు గెలవడం గమనార్హం.


Also Read: ఇంగ్లండ్‌కు భారీ షాక్.. టీ20 వరల్డ్‌కప్‌కు శామ్ కరన్ దూరం.. కారణం ఏంటంటే?


కూల్‌గా చెన్నై
చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఒత్తిడేమీ లేదు. కీలక ఆటగాళ్లకు ఈ మ్యాచులో విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్, డుప్లెసిస్‌ పరుగులు వరద పారిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. అంబటి రాయుడు సైతం ఫామ్‌ అందుకున్నాడు. అయితే టాప్‌ ఆర్డర్‌ విఫలమైతే ధోనీసేన గెలుపు అవకాశాలు దెబ్బతింటున్నాయి. మిడిలార్డర్‌ ఇప్పటికీ బలహీనంగానే కనిపిస్తోంది. ఇది వారికి చేటు చేసినా ఆశ్చర్యం లేదు. సామ్‌ కరన్‌ గాయంతో వెనుదిరగడంతో బ్రావో కీలకం అవుతాడు. అతడికీ ఫిట్‌నెస్‌ సమస్యలు ఉన్నాయి. జడ్డూ ఎప్పటిలాగే అదరగొడుతున్నాడు. శార్దూల్‌ వికెట్లు తీస్తున్నాడు. దీపక్‌ చాహర్‌ పరిస్థితి తెలియడం లేదు. మిగతా విభాగాల్లో చెన్నైకి ఇబ్బందేమీ లేదు.


Also Read: భారత్‌ x పాక్‌.. గంటల్లోనే టికెట్లన్నీ కల్లాస్‌..! వేలల్లో పలికిన ధర!


గౌరవం కోసం పంజాబ్
పంజాబ్‌ కింగ్స్‌ పేపర్‌ మీద బలంగా కనిపిస్తోంది. మైదానంలోనూ అలాగే ఆడుతున్నా.. చిన్న చిన్న మూమెంట్స్‌ను అందిపుచ్చుకోలేక ఓటమి పాలవుతోంది. వారు మానసికంగా బలంగా మారాల్సి ఉంది. కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ మంచి ఓపెనింగ్‌ అందిస్తున్నారు. మిడిలార్డర్‌ మాత్రం ఆఖరి ఓవర్లలో ఒత్తిడి తట్టుకోలేక దగ్గరికొచ్చి చేతులెత్తేస్తున్నారు. పూరన్‌, మార్‌క్రమ్‌ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. బౌలింగ్‌లో అర్షదీప్‌, షమి, రవి బిష్ణోయ్‌ రాణిస్తున్నారు. హర్‌ప్రీత్‌ బ్రార్‌ సైతం అద్భుతంగా ఆడుతూ ఆశలు రేపుతున్నాడు. ఈ మ్యాచ్‌ను గెలిచి గౌరవంగా లీగ్‌ను ముగించాలని రాహుల్‌ సేన పట్టుదలగా ఉంది. వచ్చే సీజన్‌కు ఆ జట్టు భారీ మార్పులతో వస్తుందనడంలో ఆశ్చర్యం లేదు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి