ముంబయి టెస్టులో న్యూజిలాండ్‌కు నిర్దేశించాల్సిన లక్ష్యాన్ని టీమ్ఇండియా ముందే నిర్ణయించుకొని ఉంటుందని మాజీ పేసర్ జహీర్ ఖాన్ అంచనా వేశాడు. మూడో రోజు కివీస్‌ను కనీసం 40 ఓవర్లు బ్యాటింగ్ చేయించాలని పేర్కొన్నాడు. ఆ సమయాన్ని చూసి కోహ్లీసేన ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉందని వెల్లడించాడు.
రెండో ఇన్నింగ్స్ టీమ్ఇండియా భారీ స్కోరువైపు పరుగులు తీస్తోంది. 58 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (33 బ్యాటింగ్; 75 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (44 బ్యాటింగ్; 69 బంతుల్లో) నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం టీమ్ఇండియా 457 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (62; 108 బంతుల్లో 9x4, 1x6) అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అతడు రెండో ఇన్నింగ్స్ అర్ధశతకం సాధించాడు. చెతేశ్వర్ పుజారా (47; 97 బంతుల్లో 6x4, 1x6) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు.
'టీమ్ఇండియా మనసులో ఏదో ఒక టార్గెట్ ఉండే ఉంటుంది. ఆ సంఖ్య ఎంతైనా సరే తొలి సెషన్లోనే అందుకొనేందుకు ప్రయత్నిస్తారు. అంటే స్కోరింగ్ రేట్‌పై ఓ కన్నేయాలి. బహుశా బ్యాటర్లు ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చు. మూడోరోజు న్యూజిలాండ్‌తో కనీసం 40-45 ఓవర్లు బ్యాటింగ్ చేయిస్తారని అనుకుంటున్నా. అలాంటప్పుడు బౌలర్లు ఎన్ని ఓవర్లు వేయగలరో దృష్టిలో ఉంచుకొని డిక్లేర్ చేయాలి. సమయం ముగిసినా తర్వాతి రోజు బౌలర్లు తాజాగా బంతులేస్తారు' అని జహీర్ అన్నాడు.
సమయం గడిచే కొద్దీ ముంబయిలో బ్యాటింగ్ చేయడం కష్టమని జహీర్ అంటున్నాడు. వాంఖడే పిచ్ కచ్చితంగా నిర్జీవంగా మారుతుందని అంచనా వేశాడు. కాబట్టి బ్యాటింగ్ చేయడం బ్యాటర్లకు కష్టమవుతుందని వెల్లడించాడు.
Also Read: IND vs NZ 2nd Test, Mohammed Siraj: సిరాజ్.. కిర్రాక్! వికెట్లు ఎగురుతున్న వీడియోలు వైరల్!
Also Read: PV Sindhu: వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు చేరిన సింధు.. ప్రత్యర్థి ఎవరంటే?
Also Read: Ajaz Patel Record: 10 వికెట్ల ఫీట్.. ముగ్గురిలో కామన్ పాయింట్ ఒకటే.. వారికి మాత్రమే సాధ్యమా?
Also Read: Ajaz Patel: అభిమానం అంటే భారత్‌దే.. అజాజ్‌కు స్టాండింగ్ ఒవేషన్.. అశ్విన్ కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి