Hardik Pandya Team Indai Capitain: జీవితం ఎప్పుడెలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు! అప్పటికప్పుడు పరువు పాతాళానికి పడిపోతుంది. అలాగే ఒక్క రాత్రిలో స్టార్‌డమ్ వచ్చేస్తుంది. ఇందుకు తాజా ఉదాహరణ హార్దిక్ పాండ్య (Hardik Pandya)! టీమ్‌ఇండియాకు నిఖార్సైన ఆల్‌రౌండర్ దొరికాడని మురిసేలోపే అతడి కెరీర్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. వెన్నెముక గాయంతో జట్టులో అసలు చోటే కరవైంది. అలాంటిది ఇప్పుడు భారత జట్టుకు ఏకంగా కెప్టెన్ అయిపోయాడు.
ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీసుకు బుధవారం రాత్రి బీసీసీఐ జట్టును ప్రకటించింది. తిరిగి ఫామ్ అందుకొని జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా ప్రకటించింది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌ను నడిపించిన తీరుకు ఫిదా అయింది. అంచనాల్లేని టైటాన్స్‌ను అజేయంగా నడిపించినందుకు, విజేతగా నిలిపినందుకు బీసీసీఐ సెలక్టర్లు అతడికి మర్చిపోలేని గిఫ్ట్ అందించారు. మరో నాయకుడిని పరీక్షించేందుకు నిర్ణయించారు.
Also Read: పాకెట్ డైనమైట్ బ్లాస్ట్! రాహుల్, కోహ్లీని దాటి టాప్-7కు ఇషాన్
ప్రస్తుతం టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఇది అవ్వగానే ఐర్లాండ్‌కు బయల్దేరుతుంది. అక్కడ రెండు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు కుర్రాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. కొందరు కొత్తవాళ్లకు అవకాశం కల్పించారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న రాహుల్ త్రిపాఠిని ఎంపిక చేశారు. ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్‌లో అతడు సన్‌రైజర్స్‌కు ఆడాడు. 37.54 సగటు, 158.23 స్ట్రైక్‌రేట్‌తో 413 పరుగులు చేశాడు. మిడిల్ ఓవర్లలో అతనాడిన షాట్లు అందరినీ అలరించాయి. ఇక సంజు శాంసన్ (Sanju Samson), సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తిరిగి టీమ్‌ఇండియాలోకి వచ్చారు.
Also Read: టీమ్‌ఇండియాకు బ్యాడ్ న్యూస్! కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్‌కు వెళ్లడంపై సందిగ్ధం!
భారత్ జట్టు: హార్దిక్ పాండ్య (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్