గుప్పెడంతమనసు జూన్ 16 గురువారం ఎపిసోడ్


వసు-రిషి మాటలతో ఎపిసోడ్ మొదలైంది...
వసుధార: ఇది అని స్పష్టంగా చెప్పలేను కానీ నాకో విషయం అర్థమైంది.. ల్యాబ్ లో అన్నమాటలు నా గుండెల్లోంచి వచ్చినవే సార్. మీకేవైనా జరిగితే మరుక్షణమే ఈ వసుధార గుండె ఆగిపోతుంది సార్. నిజం సార్..మీరు లేకుండా నేను బతకలేను. ఇష్టమో-ప్రేమో- ఇంకొకటో నాకు తెలియదు సార్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను..నేను ఏం తప్పు చేశానో నాకు తెలిసింది..ఐ లవ్ యూ.. 
వసు మాట విన్నవెంటనే రిషి లాగిపెట్టి కొడతాడు..
రిషి: ప్రేమో-ఇష్టమో అర్థంకావడం లేదా-నేను ఆరోజే చెబితే ఏదో అన్నావ్-క్లారిటీ లేదన్నావ్-భయం వేస్తోందన్నావ్-మరి ఈ రోజు కొత్తగా నీకు ఏం క్లారిటీ కనిపించింది-నీ భయం ఎక్కడికి పోయిందో చెప్పు-నేను అప్పుడెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను ఆరోజు నా గుండె ముక్కలు చేసి వెళ్లిపోయావ్, ఇన్నాళ్లూ ప్రతీక్షణం నేను ఎంత నరకం అనుభవించానో నీకేం తెలుసు - ఇప్పుడు నువ్వొచ్చి ఐ లవ్ యూ అనగానే ఐ టూ లవ్ టూ అంటాను అనుకుంటున్నావా.. వెళ్లు ఇంకసారి నా కళ్లకు కనిపించకు. మనసంటే బ్లాక్ బోర్డ్ కాదు వసుధారా..రాసినవి చెరిపేయడానికి. కొన్నింటిని వెనక్కు తీసుకోలేం-కొన్ని తప్పుల్ని సరిదిద్దుకోలేం వెళ్లు నా కంటికి కనిపించకు


Also Read: డాక్టర్ సాబ్ పెళ్లిపనులు మొదలయ్యాయి, రగిలిపోతున్న శోభ-నిజం తెలుసుకున్న జ్వాల


ఉలిక్కి పడి నిద్రలేచిన వసుధార ఇదంతా నా ఊహ అన్నమాట అనుకుంటుంది
వసు: ఇప్పుడు నేను వెళ్లి రిషి సార్ తో ఏం చెప్పినా కొట్టినా కడతారు. నిజమే మరి..అప్పుడు చెబితే కాదన్నావ్ ఇప్పుడు అవునంటున్నావ్ అసలు ఎలా కనిపిస్తున్నాను నీకు.. అయినా ఇలా రిషి సార్ అనుకోవడంలో తప్పేముంది. అసలు నాలో నాకేతెలియని మార్పేంటి?


రెస్టారెంట్లో ఉన్న వసుధార రిషి సార్ వస్తారా రారా అని ఎదురుచూస్తుంటుంది. అది అబ్జర్వ్ చేసిన హోటల్ యజమాని ఈ మధ్య వసుధారలో ఏదో మార్పు కనిపిస్తోందనుకుంటాడు.ఇంతలో బయట కారు ఆపిన రిషి.. నువ్వు దిగితే నేను వెళతా అంటాడు. నాతో పాటూ ఓ కప్పు కాఫీ తాగు రారా అంటాడు గౌతమ్. ఇంతలో బయటకు వచ్చిన రెస్టారెంట్ యజమాని రిషిని లోపలకు పిలుస్తాడు. రాను అని రిషి తేల్చి చెప్పేయడంతో వసుధార గురించి మీతో మాట్లాడాలి రండి సార్ అంటాడు. కట్ చేస్తే హోటల్లో కూర్చుని ఉంటారు గౌతమ్, రిషి , హోటల్ యజమాని.


హోటల్ యజమాని: కొన్ని రోజులుగా వసుధార ఏదోలా ఉంటోంది..వయసులో కాకపోయినా హోదాలో మీరు పెద్దవారు. వసుధారలో ఏదో తెలియని మార్పొచ్చింది సార్ తనేమైనా పొరపాటు చేసిందా? ( నన్ను రిజెక్ట్ చేసిందని మనసులో అనుకుంటాడు రిషి). తను ఇంతకుముందులా లేదు..బయటకు చెప్పుకోలేని విషయం ఏదో ఆ అమ్మాయిని ఇబ్బందిపెడుతోంది సార్ ..మీరే తన బాధేంటో తెలుసుకోవాలి.


ఇదంతా విన్న వసుధార మ్యానేజర్ గారు ఏంటో ఇవన్నీ రిషిసార్ కి చెబుతున్నారు అనుకుంటుంది..
రిషి: వసు ఆలోచనా ధోరణి అందరిలా ఉండదు.. అందరకీ అంతుపట్టదు కూడా..అదేంటో కొందరు చాలా ధైర్యంగా కనిపిస్తారు అంతలోనే కొన్నిటికి భయపడతారు అంటాడు ( ఇదంతా వింటుంది వసు)
వసు: సార్ ఆర్డర్  అని రిషిని చూసి అడిగితే... 2 కాఫీ అంటాడు గౌతమ్. కాఫీ తీసుకొచ్చి ట్యాబుల్ పై పెట్టగానే లేచి వెళ్లిపోతాడు రిషి. 
గౌతమ్: ఇద్దరి మధ్యా దూరం తగ్గిద్దామని తీసుకొస్తే కాఫీ తాగకుండా, వసుతో మాట్లాడకుండా వెళ్లిపోయావ్
వసుధార: రిషి కోసం తీసుకొచ్చిన కాఫీ తాగుతుంది వసుధార..ఇంతలో వెనక్కు చూసి వెళ్లిపోతాడు
గౌతమ్: వసుధారని నువ్వు అస్సలు పట్టించుకోలేదు అందుకే కోపం వచ్చిందన్న గౌతమ్..కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదంటాడు. 
వసుధార: రిషి సార్ కి నాపై కోపం పోలేదా.. ఎందుకో రిషి సార్ మళ్లీ ఇక్కడకు వస్తారని అనిపిస్తోంది అనగానే.. పక్కనే కాఫీ ప్లీజ్ అనే పిలుపు వినిపిస్తుంది. అక్కడ రిషి ఉన్నాడనే ఊహల్లో కాఫీ, ఐస్ క్రీం తేవాలా అని ఏదేదో మాట్లాడేస్తుంది. హలో అని అనగానే ఉలిక్కిపడి సారీ అనేసి వెళ్లిపోతూ మరో టేబుల్ దగ్గర రిషిని చూసి ఇది కూడా నా ఊహే అనుకుంటుంది. కాసేపటికి తేరుకుని నిజంగానే రిషి ఉన్నట్టు అర్థం చేసుకుంటుంది. 
రిషి: వసు లోపలకు వెళ్లగానే తనకోసం తీసుకొచ్చి గిఫ్ట్, కాఫీకి డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్లిపోతాడు రిషి. 
వసు: ఏంటిది అని గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తుంది. రిషికి యాక్సిడెంట్ అయినప్పుడు వసు చున్నీ రిషి దగ్గర ఉండిపోతుంది. దాన్ని ప్యాక్ చేసి తీసుకొచ్చి ఇచ్చి థ్యాంక్స్ అని స్లిప్ పెడతాడు. అన్నింటికీ అని ఎందుకు రాశారు..అని అన్నీ మరోసారి గుర్తుచేసుకుంటుంది. సార్ ని రిజెక్ట్ చేసినందుకు కూడా వెటకారంగా థ్యాంక్స్ చెబుతున్నారా? రిషి సార్ మాటలే కాదు థ్యాంక్సులు కూడా అర్థం కాలేదు. ఏదేమైనా గుర్తుపెట్టుకుని చున్నీ రిటర్న్ ఇచ్చారు. మీ అర్థంకాని థ్యాంక్సులకు నా థ్యాంక్స్ సార్..


Also Read: సాక్షికి షాక్, దేవయానికి స్ట్రోక్, రిషిపై ప్రేమ జల్లు - వసుధారతో అట్లుంటది మరి!


రెస్టారెంట్ నుంచి రూమ్ కి వెళ్లిపోయిన తర్వాత కూడా రిషి గురించే ఆలోచిస్తూ కూర్చుంటుంది వసుధార. రెస్టారెంట్లో సార్ మాట్లాడిన మాటలన్నీ నేను అన్నవే.. ఆ మాటలే నన్ను-రిషి సార్ ని దూరం చేశాయా? నేను రిషి సార్ ని బాధపెట్టానా? ఏం చేస్తున్నానో అర్థంకావడం లేదు? ఎందుకు పదే పదే రిషి సార్ కి నో చెప్పిన విషయమే గుర్తొస్తోంది.. ఆయన్ని బాధపెట్టాను.. డౌటే లేదు అందుకు sorry చెప్పాలి కానీ ఎన్నిసార్లు Sorry చెప్పినా సరిపోవడం లేదు.
ఎపిసోడ్ ముగిసింది