రష్మీ గౌతమ్ జీవితం రంగులమయం అని చాలా మంది అనుకుంటారు. ఇటు 'ఎక్స్ట్రా జబర్దస్త్' స్టేజి మీద గానీ, బుల్లితెర కార్యక్రమాల్లో గానీ... అటు సినిమాల్లో గానీ ఆమె అందంగా కనిపిస్తారు. పాత్రలకు తగ్గట్టు మేకప్ అవుతారు. అయితే... ఆ అందం వెనుక ఒక విషాదం ఉంది. రష్మీ జీవితంలో అంతులేని విషాదం ఉంది.  ఒక లోటు ఉంది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' స్టేజి మీద ఆ లోటును తలుచుకుని రష్మీ గౌతమ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు, వివరాల్లోకి వెళితే...
 
ఫాదర్స్ డే (ఆదివారం, జూన్ 19) సందర్భంగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో 'నాన్న నా హీరో' (Nanna na hero) అని ఒక స్పెషల్ ఎపిసోడ్ చేశారు. 'బుల్లెట్' భాస్కర్, నూకరాజు, గీతూ రాయల్, 'జోర్దార్' సుజాత... చాలా మంది నటీనటుల ఫాదర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరూ తండ్రితో తమ అనుబంధం గురించి చెబుతున్నారు. అప్పుడు నటి పవిత్ర (Jabardasth Pavithra) ''కొన్ని కారణాల వల్ల మా నాన్న బాగా డ్రింక్ చేసేవారు. ఆయన బతికున్నప్పుడు నేను ఎప్పుడూ మాట్లాడలేదు, ఆయన్ను ముట్టుకోలేదు. ఆయన మరణించిన తర్వాత కాళ్ళకు మొక్కి మాట్లాడాను'' అని ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత వర్ష, రష్మీ కూడా ఎమోషనల్ అయ్యారు.

  
Why Did Rashmi Gautam and Jabardasth Varsha Breakdown On Sridevi Drama Company stage?: ''బ్యాడ్ పేరెంట్స్, గుడ్ పేరెంట్స్ ఉంటారా? లేదా? అనేది నాకు తెలియదు. నా ఫాదర్ దగ్గర నుంచి నేను మాత్రం ఎప్పుడూ ఇటువంటి ఆప్యాయత చూడలేదు'' అని కన్నీళ్లు పెట్టుకుంటూ అందరికీ ఫాదర్స్ డే విషెస్ చెప్పారు రష్మీ గౌతమ్. ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లడం వలన తల్లి పెంచినట్టు గతంలో ఒకసారి చెప్పుకొచ్చారు.


Also Read: డిజిటల్ తెరపై రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ పెళ్ళంట




''ఎన్ని ఉన్నా... ఎంత ఉన్నా... డాడీ లేని లోటు ఎప్పటికీ తీరదు. డాడీ లేకపోతే చాలా బాధగా ఉంటుంది'' అని 'జబర్దస్త్' వర్ష కన్నీరు పెట్టుకున్నారు. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఫాదర్స్ డే స్పెషల్ (Fathers Day Special) ఎపిసోడ్ కొన్ని నవ్వులు... మరికొన్ని ఎమోషనల్ మూమెంట్స్‌తో సాగింది. ఫాదర్స్ డే రోజున ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. 



Also Read: హీరోయిన్ అంజలి 'బహిష్కరణ'