Anjali - Bahishkarana: హీరోయిన్ అంజలి 'బహిష్కరణ'

What Is Anjali's Bahishkarana: 'బహిష్కరణ' ఏంటి? హీరోయిన్ అంజలికి, దానికి సంబంధం ఏమిటి?

Continues below advertisement

తెలుగమ్మాయి అంజలి (Anjali) వెండితెరపై సంప్రదాయానికి చిరునామా లాంటి పాత్రలు చేశారు. 'సరైనోడు'లో స్పెషల్ సాంగ్ 'బ్లాక్ బస్టర్' చేసినా... 'శంకరాభరణం'లో లేడీ డాన్ రోల్ చేసినా... ఆమె పేరు చెబితే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి చిత్రాలు గుర్తొస్తాయి. అటువంటి అంజలి ఇప్పుడు కంప్లీట్ ఇమేజ్ ఛేంజోవర్ రోల్ చేస్తున్నారు.
 
Bahishkarana Web Series Details: తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో 'బహిష్కరణ' అని ఒక వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఆమెతో పాటు 'వకీల్ సాబ్'లో నటించిన మరో తెలుగమ్మాయి, హీరోయిన్ అనన్యా నాగళ్ళ (Ananya Nagalla), నటులు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), శ్రీతేజ, బాషా ఇతర ప్రధాన తారాగణం. జీ 5 ఓటీటీ ఒరిజినల్ సిరీస్ ఇది. మంగళవారం సిరీస్‌ను అనౌన్స్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో దీనిని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. అంజలి రగ్గడ్ లుక్‌లో కనిపించారు. 

Continues below advertisement

Also Read: నైటీ వేసిన నాటీ ఫెలో, 'హ్యాపీ బర్త్‌ డే'లో వెన్నెల కిశోర్ అలా!

''ప్రేమతో సాగాల్సిన ప్రయాణం అవమాన భారంతో, బాధతో ముళ్ళ దారిలో సాగుతుంది. ఆ ప్రయాణం ఎలా మొదలైంది? ఏ తీరానికి చేరింది? అనేది సిరీస్ లో చూడాలి'' అని 'బహిష్కరణ' బృందం పేర్కొంది. దీంతో పాటు మరికొన్ని కొత్త  వెబ్ సిరీస్‌ల‌ను ఈ ఏడాది వీక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు 'జీ 5' వెల్లడించింది.

Also Read: 'ఎవరి దగ్గరకు వెళ్ళనూ? మసి చేస్తారు' - చాందిని చౌదరి & ఫ్యామిలీని భయపెట్టిన ప్రొడ్యూసర్

Continues below advertisement