భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆటముగిసేసరికి ప్రొటీస్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు నష్టపోయి 101 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో రాణించిన కీగన్ పీటర్సన్ (48 బ్యాటింగ్: 61 బంతుల్లో, ఏడు ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. అయితే ఆట చివరి ఓవర్లో బుమ్రా ఫాంలో ఉన్న డీన్ ఎల్గర్ (30: 96 బంతుల్లో, మూడు ఫోర్లు) అవుట్ అవ్వడంతో భారత్ సంతృప్తికరంగా రోజును ముగించింది. భారత బౌలర్లలో బుమ్రా, షమి చెరో వికెట్ తీశారు.


212 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మార్క్రమ్ (16: 22 బంతుల్లో, నాలుగు ఫోర్లు) ఎనిమిదో ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత కీగన్ పీటర్సన్, డీన్ ఎల్గర్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. అయితే చివరి ఓవర్లో బుమ్రా ఎల్గర్‌ను అవుట్ చేయడంతో భారత్‌కు కాస్త ఊరట లభించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 78 పరుగులు జోడించారు.


దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్‌లో ఇంకా వాన్ డర్ డసెన్, టెంపా బవుమా, కైల్ వెరేయిన్ వంటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆడితే దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌ను, సిరీస్‌ను సొంతం చేసుకోవడం ఖాయం. భారత్ మ్యాచ్ గెలవాలంటే మాత్రం రేపు బౌలర్లు అద్భుతం చేయాల్సి ఉంది.


అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ అయింది. పంత్ (100 నాటౌట్: 139 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.






Also Read: IPL New Sponsor: వివో ఔట్‌! ఇకపై 'టాటా ఐపీఎల్‌'! చైనా కంపెనీకి గుడ్‌బై!!


Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్‌ మెగా వేలం


Also Read: Tata Group IPL Sponsor: మైదానంలో సిక్సర్ల వర్షం.. బీసీసీఐకి కాసుల వర్షం..! టాటా రావడంతో బోర్డుకు ఎంత డబ్బు వస్తోందంటే?