రోనా వైరస్ వల్ల ఎప్పుడు.. ఏ క్షణంలో లాక్‌డౌన్ ప్రకటిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మనకంటే.. నైట్ కర్ఫ్యూలతో కరోనాకు బోలెడంత మేలు చేస్తారు. కానీ, చైనా వంటి దేశాలు కరోనా వైరస్ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటాయి. ప్రజలను నిర్బంధించైనా సరే.. వైరస్ వ్యాప్తిని అరికడతారు. దీనివల్ల ప్రజల ఎదుర్కొనే తిప్పలు అన్నీ.. ఇన్నీ కావు. ఇందుకు ఓ యువతికి ఎదురైన ఈ చేదు అనుభవమే నిదర్శనం. 
 
చైనాకు చెందిన వాగంగ్ అనే మహిళ.. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ యువకుడితో బ్లైండ్ డేట్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆమె అతడి ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా వారు లంచ్ చేస్తూ.. టీవీ ఆన్ చేశారు. అంతే.. న్యూస్ చూసి షాకయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినట్లు తెలిసింది. అంతే.. వాగంగ్ గుండెల్లో రాయిపడినట్లయ్యింది. డేటింగ్ కోసమని వెళ్లి.. అనవసరంగా చిక్కుకున్నానే అని ఫీలైంది. తన ఇబ్బందికర అనుభవాన్ని ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీచాట్‌ వేదికగా పంచుకుంది. చైనీయులు పాటించే లూనార్ న్యూ ఇయర్ నేపథ్యంలో వారం రోజుల కోసం ఆమె గ్వాంగ్‌జౌ నుంచి జెంగ్‌జౌకు వెళ్లింది. 


Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!


‘‘నేను జెంగ్‌జౌకి చేరుకున్న తర్వాత, కరోనా వ్యాప్తి పెరిగింది. అధికారులు లాక్‌డౌన్ విధించడంతో అక్కడి నుంచి వెళ్లలేకపోయాను. వయస్సు పెరగడం వల్ల నా కుటుంబికులు పెళ్లి కోసం 10 సంబంధాలు చూశారు. అందులో ఓ వ్యక్తితో బ్లైండ్ డేట్ చేయాలని నిర్ణయించుకున్నా. అతడు వంటలు చాలా బాగా చేస్తాడని విన్నా. ఇంటికి వెళ్లిన తర్వాత చెప్పినట్లే.. మంచి వంట చేసి పెట్టాడు. ఇద్దరం భోజనం చేస్తున్న సమయంలో కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్ విధించిన న్యూస్ తెలిసింది. దీంతో నాలుగు రోజులపాటు నేను అతడి ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చింది. అయితే, అతడు నన్ను చాలా బాగా చూసుకున్నాడు. మంచి వంటలు వండిపెట్టాడు. అతడు చాలా తక్కువగా మాట్లాడేవాడు. అతడు నాకు నచ్చాడు. కానీ, నాలుగు రోజులు బ్లైండ్‌ డేట్‌లో చిక్కుకుంటానని అస్సలు ఊహించలేదు. అపరిచితుడి ఇంట్లో ఉండటం ఇబ్బందికరంగా అనిపించింది’’ అని తెలిపింది.  


Also Read: ఈ చేప భలే డ్రైవింగ్ చేస్తోంది.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెట్టరు కదా?
Also Read: తత్కాల్‌లో రైల్వే టికెట్స్ వేగంగా బుక్ చేయాలా? ఇదిగో ఇలా చేయండి
Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!
Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి