మీరు మాస్క్ పెట్టుకుని జాగ్రత్తగా ఉంటున్నా సరే కోవిడ్-19 వైరస్‌కు గురయ్యారా? అయితే.. మీరు ఎలాంటి మాస్క్ ధరిస్తున్నారనేది కూడా ముఖ్యమే. ఔనండి.. చాలామంది జరిమానాల నుంచి తప్పించుకోడానికో.. రైలు, బస్సుల్లో ప్రయాణాలు చేయడానికి మాస్క్ తపనిసరి అనే కారణంతోనో మాస్కులను మొక్కుబడిగా ధరిస్తున్నారు. చవకగా వచ్చే క్లాత్ మాస్క్‌లను పెట్టుకుంటున్నారు. తమని తాము మోసం చేసుకుంటున్నారు. కరోనాకు గురై.. ప్రతికూల పరిస్థితులతో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కరోనాతో తమతో తీసుకెళ్లడమే కాకుండా.. కుటుంబ సభ్యులకు కూడా అంటిస్తూ.. వారి ప్రాణాలను హరిస్తున్నారు. గతేడాది భయాందోళనలకు గురిచేసిన డెల్టా వేరియెంట్ నుంచి ప్రజలు ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. మనకు వరకు వస్తే చూసుకుందామని.. వ్యాక్సిన్ వేయించుకున్నామనో ధైర్యం, ఒమిక్రాన్ వల్ల పెద్దగా ముప్పు ఉండదంటూ వస్తున్న వార్తలు.. తదితర కారణాలు బాధ్యత లేకుండా చేస్తున్నాయి. ఈ నిర్లక్ష్యం చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్‌మాస్కుల ఎంపిక విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దని సూచిస్తున్నారు.
ఎలాంటి మాస్కులు ధరించాలి?: ప్రజలు ఎలాంటి ఫేస్ మాస్కులు పెట్టుకోవాలనేది తెలుసుకోవాలి. అలాగే.. వాటిని ఎంతకాలం ధరించాలనేది కూడా తెలుసుకోవడం ముఖ్యం. వివిధ అధ్యయనాల ప్రకారం.. క్లాత్, సర్జికల్ మాస్కులకు బదులుగా.. N95, KN95, KF94 మాస్క్‌లు ధరించడం మంచిది. డెల్టా వేరియెంట్ ప్రభావం తగ్గిన తర్వాత చాలామంది.. సర్జికల్ మాస్కులను తరచుగా ఉపయోగించడం మొదలుపెట్టారు. అయితే, N95 వంటి మాస్కులతో పోల్చితే.. సర్జికల్ మాస్క్‌లు అంత ప్రభావంతంగా పనిచేయవు. ఉదాహరణకు.. మాస్క్ ధరించని ఒక కోవిడ్-19 వ్యక్తి నుంచి సర్జికల్ మాస్క్ ధరించిన వ్యక్తి వైరస్ సోకడానికి సుమారు 30 నిమిషాలు పడుతుంది. అదే.. N95 మాస్క్ ధరించే వ్యక్తికైతే దాదాపు 2.5 గంటలు పడుతుందని అధ్యయనం పేర్కొంది. అంటే.. మీరు సర్జికల్ మాస్క్ ధరించి బయటకు వెళ్తే.. దానితో 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు తిరగకూడదు. అలాగే N95 మాస్కులను 2.5 గంటలకు మించి ఎక్కువ సేపు ధరించకూడదు.
మాస్కులను ఎలా ఉపయోగించాలి?: అలాగే సర్జికల్ మాస్క్‌లను పదే పదే వినియోగించడం కుదరదు. ఒక్కసారే వాడి పడేయాలి. అయితే, N95 మాస్క్.. ఆ వ్యక్తి తిరిగే ప్రాంతాలు, రద్దీ ఆధారంగా ఎంత సేపు ధరించవచ్చు, ఎన్నిసార్లు ధరించవచ్చు అనేది ఆధారపడి ఉంటుంది. అయితే, N95ను సానిటైజ్ చేయడం కుదరదు కాబట్టి.. ప్రతి 2 రోజులకు మార్చుతూ ఉండాలి. కాబట్టి.. మీ వద్ద కనీసం 4 నుంచి 5 మాస్కులు ఉంచుకుని.. మూడు రోజుల చొప్పున మార్చి మార్చి ఉపయోగించడం వల్ల వైరస్‌కు చిక్కకుండా జాగ్రత్తపడవచ్చు. వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రెండు మాస్కులను ధరించడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. మీరు ధరించే N95 మాస్క్ మీద సర్జికల్ మాస్క్ పెట్టుకొని.. బయట నుంచి వచ్చిన తర్వాత ఒక పేపర్ కవర్లో పెట్టి జాగ్రత్తగా పడేయాలి. అలాగే ఎక్కువ రద్దీ ప్రాంతాల్లో N95 మాస్క్‌ను పెట్టుకుని తిరిగినట్లయితే.. దాన్ని మళ్లీ ఉపయోగించకూడదు. ఈ మాస్కులను బహిరంగ ప్రాంతాల్లో పడేయకూడదు.
మాస్కులను ఎంత సేపు ధరిస్తే.. సేఫ్?: మాస్కుల ఎంత సేపు ధరించాలి అనేది ఆ వ్యక్తి ఉండే ప్రాంతాలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో హెల్త్ సేఫ్టీ ఆఫీసర్ మాట్ కార్ల్సన్ తెలిపారు. ముఖ్యంగా మాస్క్‌కు ఉండే పొరల్లో ఎలాంటి లోపాలు లేకపోతే.. దాన్ని మళ్లీ ఉపయోగించవచ్చు. ఒక వేళ మాస్క్ మురికిగా మారినా, తడిచినా, నలిగిన, చిరిగినా మళ్లీ ఉపయోగించకూడదు. రద్దీ ప్రాంతాల్లో ఆ మాస్క్‌ను ధరించినట్లయితే.. మళ్లీ వాడకూదు. మీరు పదే పదే మాస్క్‌ను కిందకు పైకి కదపడం, అడ్జస్ట్ చేయడం వంటివి చేస్తే.. మాస్క్ నాణ్యత దెబ్బతింటుంది. అందులోని ఫిల్టర్ల మధ్య దూరం పెరిగి.. వైరస్ ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. మీకు తుమ్ములు ఎక్కువగా ఉన్నట్లయితే.. మాస్కులను తరచుగా మార్చుతూ ఉండాలి. ఇంట్లో పిల్లలకు చిక్కకుండా సురక్షితంగా పడేయాలి.
Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!
కరోనా సైజు తెలిస్తే.. క్లాత్ మాస్క్ మళ్లీ వాడరు: క్లాత్ మాస్క్‌లో ఫిల్టర్లు ఉండవు. కొన్ని ధారాల అల్లికే క్లాత్. ధారాల మధ్య దూరంలో మన తల వెంటుక సులభంగా దూరుతుంది. వాస్తవానికి కరోనా వైరస్ సైజు.. మన తల వెంటుకలు కంటే 100 నుంచి 150 రెట్లు చిన్నది. మన తల వెంటుక సైజు 50-180 μm (మైక్రాన్) ఉంటుంది. గాల్లో ఉండే దూళి.. 10 నుంచి 40 మైక్రాన్లు ఉంటుంది. దీన్ని మనం కళ్లతో కూడా చూడవచ్చు. ఇక మన శరీరంలో ఉండే రక్త కణాలు.. 7-8 మైక్రాన్లు ఉంటాయి. మనం తుమ్మినప్పుడు వచ్చే తుపర్లలోని బిందువులు 5 నుంచి 10 మైక్రాన్లు ఉంటాయి. మనల్ని రోగాలుపాలు చేసే బ్యాక్టీరియా.. 1-మైక్రాన్లు ఉంటాయి. మనల్ని ఇప్పుడు వణికిస్తున్న కరోనా వైరస్ సైజు 0.1-0.5 మైక్రాన్ ఉంటుంది. అందుకే, అవి క్లాత్ మాస్క్, సర్జరీ మాస్క్‌ల నుంచి కూడా సులభంగా ముక్కులోకి ప్రవేశించగలవు. అవి కళ్ల నుంచి శరీరంలోకి ప్రవేశించగలవు. కాబట్టి.. ప్రయాణాల్లో మాస్క్‌తోపాటు ఫేస్ షీల్డ్ కూడా పెట్టుకోవడం మంచిది. ఎవరైనా నేరుగా తుమ్మినా.. వైరస్ నేరుగా మీ మాస్క్‌లోకి ప్రవేశించలేదు. కాబట్టి.. ఇప్పటికైనా క్లాత్ మాస్కులు, ఫ్యాషన్, మ్యాచింగ్ మాస్క్‌లను పక్కన పెట్టి.. మిమ్మల్ని సురక్షితంగా ఉంచే మాస్కులు ధరించండి.
Also Read: ఈ చేప భలే డ్రైవింగ్ చేస్తోంది.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెట్టరు కదా?
Also Read: తత్కాల్‌లో రైల్వే టికెట్స్ వేగంగా బుక్ చేయాలా? ఇదిగో ఇలా చేయండి
Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది
Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి