వైఎస్ఆర్ తెలంగాణపార్టీని ప్రకటించిన షర్మిలకు ఇప్పుడు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ పేరు పై అభ్యంతరాలు వ్యక్తమయినట్లుగా ఎన్నికల సంఘం చెబుతోంది. వైఎస్ఆర్ అనే పేరు ఉపయోగించుకునే అంశంపై అన్న వైఎస్ఆర్ పార్టీ నుంచి అభ్యంతరాలు వచ్చాయని అందుకే పేరును రిజిస్ట్రేషన్ చేయలేదని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. ఇతర పేర్లు ప్రతిపాదించాలని సూచించామని ఈసీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది.
Also Read: తెలంగాణలో జీవో 317 మంటలు ! ఆ జీవోలో ఏముంది ? ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ?
ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల కార్యక్రమాలను సైతం మొదలుపెట్టారు. షర్మిల పార్టీ పేరుపై అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈసీకి లేఖ పంపారు. తన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆయన సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరారు. దీనికి ఈసీ నుంచి వైయస్ షర్మిల పార్టీని రిజిష్టర్ చేయలేదని.. మరికొన్ని ఇతర పేర్లు సూచించాలని షర్మిలకు లేఖ కూడా రాసినట్లు ఎన్నికల సంఘం సమాచారం పంపింది.
Also Read: రాఘవ కేసులో పోలీసులపై ఒత్తిడి? రౌడీషీట్ ఓపెన్ చేయకుండా ఆడ్డుకుంటుందెవరు?
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్‌సీపీ పేరు తమ పార్టీ పేరును పోలి ఉందంటూ,ఆ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి,సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈకేసు విచారణలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అసలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. షార్ట్ కట్‌లో వైఎస్ఆర్‌సీపీ అని పిలుస్తున్నారు. అయితే తన పార్టీ అన్న వైఎస్ఆర్‌ను పోలి ఉందని.. తన పార్టీ పేరును వాడుకుంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
షర్మిలకు కు వైయస్సార్ పేరుతోనే పార్టీ కావాలంటే మహబూబ్ బాషా తో రాజీ చేసుకోవాల్సి ఉంది. లేకపోతే వైఎస్ఆర్ పేరు లేకుండా వేరే పేరు పెట్టుకోవాల్సి రావొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ పేరుతో భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన ఏకైక పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మహబూబ్ బాషా చెబుతున్నారు. ఈ అంశంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలు ఇంకా స్పందించలేదు.
Also Read: ఫ్రంట్ లేదు టెంట్ లేదు.. ఏ క్షణమైనా కేసీఆర్ జైలుకు వెళ్తారన్న బండి సంజయ్ !