దేశంలో కోవిడ్‌ పరిస్థితులపై సీఎంలతో ప్రధాని మోదీ గురువారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం జగన్ వీడియో పాల్గొన్నారు. కోవిడ్‌ విస్తరణ, నివారణ చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. దేశంలో కోవిడ్‌ విస్తరణ పరిస్థితులను ప్రజెంటేషన్‌ ద్వారా కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. 15–18 ఏళ్ల టీనేజర్ల అధికంగా వ్యాక్సిన్లు వేసిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలించింది. మొదటి డోస్‌ 100శాతం పూర్తిచేసిన రాష్ట్రాల్లో ఏపీ ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  


Also Read: క్షవరం అయిందని ఓటర్లకు రెండేళ్ల తర్వాత తెలిసింది.. ఉద్యోగులకు సీఎం శఠగోపం పెట్టారు


రెండో డోస్ వ్యాక్సినేషన్ 70 శాతం పూర్తి


దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై సీఎంలతో చర్చించారు. వివిధ రాష్ట్రాల కోవిడ్ నివారణ చర్యలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసే చర్యలపై దిశానిర్దేశం చేశారు.  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభమై ఏడాది పూర్తవుతుందని తెలిపారు. 10 రోజుల్లోనే 3 కోట్ల మంది టీనేజర్లకు కోవిడ్‌ వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు చెప్పారు. రాష్ట్రాల వద్ద పూర్తిస్థాయిలో కోవిడ్‌ టీకాలు అందుబాటులో ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వృద్ధులకు ప్రికాషన్‌ డోసు అందిస్తున్నామని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లో టీకాల కార్యక్రమం నిర్వర్తిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో రెండో డోసు వ్యాక్సినేషన్‌ 70 శాతం పూర్తయిందని తెలిపారు. 


Also Read: ఏపీలో టికెట్ రేట్స్ పెరిగితే మాకు బోనస్! టికెట్ రేట్స్ తగ్గించిన తర్వాతే... - నాగచైతన్య ఇంటర్వ్యూ


Also Read: Covid Updates: పండుగ స‌మ‌యంలో జాగ్రత్త... ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్దు... కిమ్స్ ఐకాన్ వైద్యులు సూచన


Also Read: Tollywood Jagan : ‘టాలీవుడ్ రియాక్షన్’ ఆపడమే అసలు వ్యూహం! జగన్ ప్లాన్ వర్కవుట్ అయినట్లేనా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి