దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో తొలిరోజే టీమ్ ఇండియా ఆలౌటైంది. మెుదటి ఇన్నింగ్స్ లో 223 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 79 పరుగలు చేశాడు. అయితే కీలకమైన టైమ్ లో ఔటయ్యాడు. సెంచరీ చేసేలా ఉన్నాడు అనుకునే టైమ్ లో అవుట్‌సైడ్ ఎడ్జ్‌తో రబాడ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. పుజారా (43), రిషబ్ పంత్ (27) పరుగులు చేశారు. కేఎల్‌ రాహుల్‌ (12), మయాంక్ అగర్వాల్‌ (15), అజింక్య రహానె (9), అశ్విన్‌ (2), శార్దూల్‌ ఠాకూర్‌ (12), ఉమేశ్‌ 4, షమీ 7 రన్స్ చేశారు. తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సౌత్ ఆఫ్రికా వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. 


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. పుజారా, కోహ్లీ జోడీ కాసేపు దక్షిణాఫ్రికా బౌలర్లను ఆడుకున్నా.. జాన్సన్  చేతిలో పుజారా ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన రహానె తడబడ్డాడు. 12 బంతుల్లో 9 పరుగులే చేసి.. రబాడ చేతికి చిక్కాడు.


దక్షిణాప్రికా బౌలర్లు.. రబాడ 4, జాన్‌సెన్ 3, ఒలివియర్‌, కేశవ్‌, ఎంగిడి మహరాజ్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. సఫారీలు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కోహ్లీ, పుజారా, పంత్ మినహా మిగతా ఎవరూ క్రీజ్‌లో నిలబడలేకపోయారు. పుజారా క్రీజులో నిల్చున్న భారీ స్కోరు సాధించలేకపోయాడు. రిషబ్ పంత్‌  కాన్ఫిడెన్స్ గా కనిపించాడు.


Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్‌ మెగా వేలం


Also Read: Washington Sundar Covid Positive: వాషింగ్టన్‌ సుందర్‌కు కరోనా! దక్షిణాఫ్రికాతో వన్డే సిరీసుకు డౌటే!!


Also Read: IPL New Sponsor: వివో ఔట్‌! ఇకపై 'టాటా ఐపీఎల్‌'! చైనా కంపెనీకి గుడ్‌బై!!


Also Read: Siddharth Lewd Tweet Controversy: సిద్దార్థ్ దేశానికి ఏం చేశాడు? కన్నీళ్లు పెట్టుకున్న సైనా నెహ్వాల్ తండ్రి


Also Read: IND vs SA, 3rd Test: సర్‌ప్రైజ్‌!! సిరీసులో వరుసగా మూడో టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా!!


Also Read: IND vs SA, Jasprit Bumrah: 'ఎక్కడ మొదలు పెట్టానో.. అక్కడికే తిరిగొచ్చా' అంటున్న పేసుగుర్రం!


Also Read: KTR Support Mallika Handa: దివ్యాంగ క్రీడాకారిణికి మంత్రి కేటీఆర్ ఆపన్నహస్తం... మల్లికా హందాకు రూ.15 లక్షల ఆర్థికసాయం