ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతోంది. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఏడాదికో సారి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించుకుని .. బయటకు రాకుండా కరోనాకు దొరక్కుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ వైరస్‌కు కొత్త వేరియంట్లతో పాటు.. దానికి అనుబంధంగా పుట్టుకొచ్చే రోగాలు పెరిగిపోతున్నాయి. మానవాళికి ముప్పుగా మారాయి. తాజాగా ఫ్లూరోనా అందర్నీ వణికిస్తోంది. ఈ ఫ్లూరోనాతో పెరూలో మూడు మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్లూరోనా భయం పెరిగిపోతోంది. 


Also Read: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?


ఫ్లూరోనా అంటే.. కొత్త వేరియంట్ కాదు.  సాధారణంగా వచ్చే ఫ్లూ... కరోనా ఉన్న వ్యక్తికి సోకితే అదే ఫ్లూరోనా. ఫ్లూ, కొవిడ్‌-19 ఒకేసారి వస్తే ఫ్లూరోనా సోకడంగా అభివర్ణిస్తున్నారు. ఫ్లూ, కొవిడ్‌-19.. రెండూ శ్వాసకోశ సమస్యలే. రెండూ శ్వాసమార్గాల మీద దాడిచేసేవే. వీటి లక్షణాలూ దాదాపు సమానమే. వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో రెండు కలిపి ఒకే సారి వచ్చినా తట్టుకుంటున్నారు కానీ వ్యాక్సినేషన్ జరగని వారిపై మాత్రం తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.  ఒక్కోసారి న్యూమోనియా బారిన పడుతున్నారు. దీంతో కోమాలోకి వెళ్లిపోతున్నారు. వారికి లైఫ్ సపోర్ట్ పెట్టాల్సి వస్తోంది. 


Also Read: ఈ మూడు లక్షణాలు కనిపిస్తే అది ఒమిక్రాన్ కావచ్చు... తేలికగా తీసుకోవద్దు


ఫ్లూరోనాలో రెండు వైరస్‌లను ఒకేసారి ఎదుర్కోవాల్సి రావటం వల్ల రోగనిరోధకవ్యవస్థ మీద ఒత్తిడి బాగా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫ్లూ, కరోనా రెండూ లక్షణాలు లేనివారి నుంచీ ఇతరులకు వ్యాపిస్తుండటాన్ని నిపుణులు గుర్తించారు.  ఇన్‌ఫెక్షన్‌ తలెత్తిన 1-4 రోజుల తర్వాత ఫ్లూ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇక కొవిడ్‌-19 లక్షణాలు 5-14 రోజుల్లో ఎప్పుడైనా ఆరంభం కావొచ్చు. ఈలోపు వీరి నుంచి వైరస్‌ ఇతరులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్లూ, కొవిడ్‌ లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల ఫ్లూరోనాను గుర్తించటం కష్టం. రెండింటి పరీక్షలు చేస్తే గానీ నిర్ధరణ కాదు.  


Also read: సెలెబ్రిటీ గాసిప్స్ ఇష్టపడేవారికి తెలివి తక్కువగా ఉంటుంది... కొత్త అధ్యయన ఫలితం


 
కొవిడ్‌-19 టీకాలతో పాటు ఫ్లూ టీకా తీసుకోవాలనే సూచనలు వైద్య నిపుణుల నుంచి వస్తున్నాయి. వృద్ధులు, గర్భిణులు, పిల్లలు, ఇతరత్రా జబ్బులు గలవారు ఇలా ఖచ్చితంగా రెండు రకాల టీకాలు తీసుకోవాలంటున్నారు. రెండు టీకాలు ఒకేసారి తీసుకున్నా సురక్షితమేనని బ్రిటన్‌ లో జరిగిన  ఓ రీసెర్చ్‌లో తేలింది. ఫ్లూరోనాకూ కొవిడ్‌-19, ఫ్లూ చికిత్సలే ఉపయోగపడతాయి. విశ్రాంతి తీసుకోవటం.. నొప్పులు, జ్వరం తగ్గటానికి మాత్రలు వేసుకోవటం లాంటివి చేస్తే చాలు.  కరోనా అయినా.. ఫ్లూరోనా అయినా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సోకిన తర్వాత ధైర్యంగా ఉండాలి. 



Also read: వేడి చేస్తే తేనె విషంగా మారుతుందా? ఈ వాదనలో నిజమెంత?


 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.