టీమ్‌ఇండియా కెప్టెన్సీ నుంచి దిగిపోవడంపై విరాట్ కోహ్లీ స్పందించాడు. నాయకత్వం మరొకరికి అప్పగించడంతో కాస్త ఉపశమనం లభిస్తుందని అంటున్నాడు. కొన్నేళ్లుగా ఎడతెరపి లేకుండా క్రికెట్ ఆడుతున్నానని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా తన ఆఖరి మ్యాచులో ఎందుకు బ్యాటింగ్ చేయలేదో వివరించాడు. నమీబియాపై విజయం తర్వాత అతడు మాట్లాడాడు.
'ఇప్పటికి ఉపశమనం లభించింది! కెప్టెన్‌గా ఉండటం గొప్ప గౌరవమే. కానీ అన్నీ సరైన దిశలో సాగాలి. నా పనిభారం పర్యవేక్షించుకొనేందుకు ఇదే సరైన సమయం అనిపించింది. ఆరేడేళ్లుగా ఎక్కువ పనిభారం అనుభవించా. ఒత్తిడిని ఫీలయ్యా. మేం కోరుకున్న ఫలితం దక్కలేదని తెలుసు. కానీ మేం మంచి క్రికెట్ ఆడాం. టీ20 క్రికెట్లో కొద్ది తేడాతోనే ఓడిపోతుంటారు. తొలి రెండు మ్యాచుల్లో మేం తొలి రెండు ఓవర్లు దూకుడుగా ఆడలేకపోయాం. ముందు చెప్పినట్టే మేం ఎక్కువ రక్షణాత్మకంగా ఆడాం. ఏదేమైనా మేం కఠినమైన గ్రూప్‌లో ఉన్నాం' అని విరాట్ అన్నాడు.
'ఆటగాళ్లందరికీ కృతజ్ఞతలు. కొన్నేళ్లుగా వారు అద్భుతమైన వాతావరణం సృష్టించారు. టీమ్‌ఇండియా డ్రస్సింగ్ రూమ్‌లోకి రావడాన్ని ప్రేమించారు. కెప్టెన్సీ నుంచి దిగిపోయినా నా ఆటతీరులో మార్పు ఉండదు. అలా జరిగిన రోజు ఆటకు దూరమవుతా. ఈ ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌కు ఎక్కువ గేమ్‌టైం దొరకలేదు. అతడికి ఇదో మంచి జ్ఞాపకంగా ఉంటుందని భావించాను. అందుకే రోహిత్ ఔటయ్యాక నేను బ్యాటింగ్‌కు రాలేదు' అని కోహ్లీ చెప్పాడు.
Also Read: T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ముందుగానే నిష్క్రమించటానికి ప్రధాన కారణాలేంటి?
Also Read: Kohli as T20 Captain: ఆ విషయంలో కోహ్లీని కొట్టేవాళ్లే లేరు.. ఇప్పటికీ నెంబర్ వన్‌నే
Also Read: Watch Video: దటీజ్ రిషబ్ పంత్.. నమీబియాతో మ్యాచ్‌లో యువ సంచలనం చేసిన పనికి నెటిజన్లు ఫిదా
Also Read: Net Run Rate: ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత కీలకమైన నెట్‌రన్‌రేట్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు?
Also Read: T20 World Cup 2021: ఘోరవైఫల్యానికి ఐదు కారణాలు.. ఓటమి నేర్పిన పాఠాలు ఇవే!
Also Read: NZ vs AFG, Match Highlights: అయిపాయె..! అటు టీమ్‌ఇండియా ఇటు అఫ్గాన్ ఔట్.. సెమీస్‌కు కివీస్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి