ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్-12 తొలిపోరులో ఆస్ట్రేలియా అదరగొట్టింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాను దెబ్బకొట్టింది. 20 ఓవర్లలో కంగారూలు సఫారీలను కేవలం 118/9కే పరిమితం చేశారు. అయిడెన్ మార్‌క్రమ్ (40: 36 బంతుల్లో 3x4, 1x6) ఒక్కడే రాణించాడు. ఆఖర్లో కగిసో రబాడా (19 నాటౌట్) కాస్త బ్యాటు ఝుళిపించడంతో స్కోరు వంద దాటింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు కోరుకున్న ఆరంభం దక్కలేదు. మిచెల్ స్టార్క్ (2), హేజిల్‌వుడ్ (2), ఆడమ్ జంపా (2) తమ బౌలింగ్‌తో ప్రత్యర్థిని వణికించారు. దాంతో పవర్‌ప్లేలోనే సఫారీ జట్టు మూడు కీలక వికెట్లను చేజార్చుకుంది. జట్టు స్కోరు 13 వద్ద తెంబా బవుమా (12), 16 వద్ద రసి వాన్‌డర్ డుసెన్ (2), 23 వద్ద క్వింటన్ డికాక్ (7) పెవిలియన్ చేరారు.
తీవ్ర ఒత్తిడితో హెన్రిక్ క్లాసెన్ (13) కూడా 8 ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఈ క్రమంలో డేవిడ్ మిల్లర్ (16) సహకారంతో అయిడెన్ మార్‌క్రమ్ మంచి షాట్లు ఆడాడు. దాంతో స్కోరు 80 దాటింది. కానీ 14వ ఓవర్లో మిల్లర్, ప్రిటోరియస్ (1)ను ఆడమ్ జంపా ఔట్ చేయడంతో సఫారీలు వందైనా చేస్తారా అనిపించింది. జట్టు స్కోరు 98 వద్ద మార్‌క్రమ్‌ను స్టార్క్ ఔట్ చేశాడు. ఆఖర్లో రబాడా 23 బంతుల్లో 19 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో స్కోరు 118కి చేరుకుంది.
Also Read: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్ అంచనా
Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!
Also Read: ఐపీఎల్ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్ యునైటెడ్' ఆసక్తి!
Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి