అక్షయ్ కుమార్, పరేశ్ రావల్, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓ మై గాడ్’. దీనికి సీక్వెల్‌గా ‘ఓ మై గాడ్-2’ తెరకెక్కుతోంది. ఇందులో అక్షయ్ మరోసారి దేవుడి పాత్రలో నటించబోతున్నాడు. ఫస్ట్ లుక్ ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన అక్షయ్ కుమార్ '#OMG2 కోసం మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కావాలి. ఒక ముఖ్యమైన సామాజిక సమస్యను ప్రతిబింబించేందుకు మేం ప్రయత్నం చేస్తున్నారు. హర హర మహాదేవ అంటూ పోస్ట్ చేశారు.
అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మూవీ టీమ్ లో ఒకరికి కరోనా సోకడంతో తనని హోం క్వారంటైన్‌కి తరలించారు. ఇతర సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో తిరిగిషూట్ను ప్రారంభించారు. కానీ రెండు రోజుల వ్యవధిలోనే కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్‌గా తేలింది. దీంతో టీమ్ సభ్యులంతా కోలుకునే వరకూ షూటింగ్ నిలిపేశారు. అందరూ కోలుకుని కరోనా ఉధృతి తగ్గిన తర్వాత మళ్లీ షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ వారం క్రితం మళ్లీ ఏడుగురికి కరోనా సోకడంతో అర్థాంతరంగా చిత్రీకరణ నిలిపేశారు. ఈ మేరకు రెండు వారాల పాటు షూటింగ్‌ను నిలిపివేసినట్టు నిర్మాత్ అశ్విన్ వర్దే ప్రకటించారు.
Also Read: బాలయ్య మంచి మనసు.. ‘ఆహా’ టాక్ షో పారితోషకంతో ఏం చేయనున్నారంటే..
ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏంటంటే...రామాయణ్’ (1987) అనే హిందీ ధారావాహికలో శ్రీరాముడి పాత్ర పోషించి, విశేష గుర్తింపు పొందిన అరుణ్ గోవిల్.తొలిసారి బాలీవుడ్ లో 'ఓ మై గాడ్ 2' లో కనిపించబోతున్నారు. ఇక 'ఓ మై గాడ్' సూపర్ హిట్ అవడంతో సీక్వెల్ పై కూడా భారీ అంచనాలున్నాయి. 'ఓ మై గాడ్' సినిమాని తెలుగులో 'గోపాల గోపాల' గా తెరకెక్కించి హిట్టందుకున్నారు పవన్ కళ్యాణ్-వెంకటేష్.ఈ లెక్కన తెలుగులో కూడా సీక్వెల్ ఉండొచ్చేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అక్షయ్ కుమార్ మూవీస్ విషయానికొస్తే ‘సూర్యవంశీ’ ‘బచ్చన్ పాండే’, ‘పృథ్వీరాజ్’, ‘ఆత్రంగీ రే’, ‘రామ్ సేతు’, ‘రక్షా బంధన్’, ‘మిషన్ సిండ్రెల్లా’ సినిమాలున్నాయి. వీటిలో కొన్నివిడుదలకు సిద్ధంగా ఉండగా..మరికొన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. అయితే తన 150వ సినిమాను ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట అక్షయ్ కుమార్.
Also Read: 'రాధే శ్యామ్' టీజర్: ప్రభాస్‌కు అన్నీ తెలుసు... కానీ చెప్పడు! ఎందుకంటే?
Also Read: డార్లింగ్ ప్రభాస్‌కు అందాల దేవసేన శుభాకాంక్షలు.. లవ్ సింబల్ లేకుండా జాగ్రత్త
Also Read: ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారంటే...!
Also Read: డార్లింగ్ ప్రభాస్ కి ఇలాంటి బర్త్ డే గిఫ్ట్ ఎవ్వరూ ఇచ్చి ఉండరు..
Also Read: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..
Also Read: ప్రభాస్ సినిమాల స్పెషల్ షోస్‌తో థియేటర్లు హౌస్‌ఫుల్.. ఫ్యాన్స్ హంగామా.. ఇవిగో వీడియోలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి