నమీబియాతో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మొదటి 15 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన నమీబియా చివరి ఐదు ఓవర్లలో చేతులెత్తేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కాస్త నిదానంగానే ప్రారంభం అయింది. మొదటి వికెట్‌కు 30 పరుగులు జోడించిన అనంతరం న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ అవుటయ్యాడు. ఆ తర్వాత ఏడో ఓవర్లో మరో ఓపెనర్ డేరిల్ మిచెల్ కూడా అవుటవ్వడంతో న్యూజిలాండ్ 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వేలను స్కాట్లాండ్ బౌలర్లు కట్టడి చేయడంతో వికెట్లు పతనం ఆగినా పరుగులు కూడా నిదానంగానే వచ్చాయి. వీరిద్దరూ రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించిన అనంతరం కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లోనూ, డెవాన్ కాన్వే ఇన్నింగ్స్ 14వ ఓవర్లోనూ అవుటయ్యారు. దీంతో న్యూజిలాండ్ మరోసారి కష్టాల్లో పడింది.
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జిమ్మీ నీషం, గ్లెన్ ఫిలిప్స్ 15, 16 ఓవర్లు కాస్త నిదానంగా ఆడారు. ఆ తర్వాత వీరు కూడా గేరు మార్చారు. వీరి దూకుడుతో న్యూజిలాండ్ చివరి నాలుగు ఓవర్లలో ఏకంగా 67 పరుగులు సమర్పించింది. ఐదో వికెట్‌కు వీరు కేవలం 36 బంతుల్లోనే 76 పరుగులు జోడించడం విశేషం.
నమీబియా బౌలర్లలో స్కోల్జ్, వీస్, ఎరాస్మస్ తలో వికెట్ తీశారు. ఈ 164 పరుగుల లక్ష్యాన్ని నమీబియా ఛేదిస్తే మాత్రం అది భారత్‌కు బాగా కలిసొచ్చే అంశం. ఎందుకంటే అప్పుడు టీమిండియా సెమీస్ అవకాశాలు కచ్చితంగా మెరుగవుతాయి.
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ