Ugadi Panchangam Sri Krodhi Nama Samvatsaram 2024 to 2025 Gemini Yearly Horoscope : శ్రీ క్రోధి నామసంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం : 14 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 6 అవమానం : 6
శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశివారికి గురుడు శుభస్థానంలో ఉన్నందుకు ఎంత కష్టమైన పనులనైనా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయగలరు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు సక్సెస్ ఫుల్ గా సాగుతాయి. అన్ని రంగాల వారు మంచి వృద్ధిలోకి వస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వైవాహిక జీవితంలో ఉండే వివాదాలు ఈ ఏడాది సమసిపోతాయి. ధైర్యంగా ఉంటారు...అయితే అష్టమ శని ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. వాహనప్రమాద సూచనలున్నాయి జాగ్ర్తతగా ఉండాలి.
Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!
కర్కాటక రాశి ఉద్యోగులకు
ఈ రాశి ఉద్యోగులకు ఈ ఏడాది మంచి యోగకాలం అనే చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవారు ప్రమోషన్ తో కూడిన ఆదాయం పెరుగుతుంది.
అధికారుల నుంచి గుర్తింపు పొందుతారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అయ్యే సూచనలున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారికి ఉన్నతాధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.
కర్కాటక రాశి వ్యాపారులకు
ఈ రాశి వ్యాపారులకు లాభదాయకమైన కాలం. పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి శుభసమయం. హోల్ సేల్, రీటైల్ రంగంలో ఉండేవారు ఊహించని లాభాలు పొందుతారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు కలిసొస్తాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కలిసొచ్చే సమయం ఇది
కర్కాటక రాశి రాజకీయ నాయకులకు
ఈ రాశి రాజకీయనాయకులకు మంచి సమయమే ఇది. ప్రజల్లో, అధిష్టానంలో మంచి పేరు ప్రఖ్యాతులుంటాయి. ఎన్నికల్లో విజయం సాధిస్తారు, ఆశించిన పదవులు పొందుతారు. ధనవ్యయం ఉంటుంది. చాలా నూతన కార్యక్రమాలు చేపడతారు.
కర్కాటక రాశి కళాకారులకు
ఈ రాశి కళాకారులకు కూడా గురుబలం కలిసొస్తుంది. నూతన అవకాశాలు వస్తాయి. ఆదాయం బావుంటుంది. ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి అవార్డులు రివార్డులు పొందుతారు
కర్కాటక రాశి విద్యార్థులకు
ఈ రాశి విద్యార్థులకు గురుబలం ఉండడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పరీక్షలలో మంచి మార్కులు సంపాదిస్తారు. ఉన్నత విద్యకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంజినీరింగ్, మెడికల్ వంటి ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. కావాల్సిన కళాశాలలో సీట్లు సంపాదిస్తారు. క్రీడాకారులు తమకు కావాల్సిన జట్లలో స్థానం సంపాదించుకోగలుగుతారు
వ్యవసాయదారులకు
కర్కాటక రాశి వ్యవసాయ దారులకు రెండు పంటలు లాభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది..పంట రుణాలు తీర్చగలుగుతారు. కౌలుదార్లు కూడా లాభపడతారు
ఓవరాల్ గా చెప్పాలంటే కర్కాటక రాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం యోగకాలం. ఊహించనంత ఉన్నతి పొందుతారు. ప్రతి ఒక్కరి దృష్టి మీపై ఉంటుంది. గత కొన్నేళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. అయితే అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు...
ఉగాది 2024 - 2025 క్రోధి నామ సంవత్సరం మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఉగాది 2024 - 2025 క్రోధి నామ సంవత్సరం వృషభ రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఉగాది 2024 - 2025 క్రోధి నామ సంవత్సరం మిథున రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.