Ugadi Panchangam Krodhi Nama Samvatsara 2024-2025  Aadaya Vyayam:  తెలుగు సంవత్సరాలు 60 లో ఇప్పుడు శోభకృత్ నామ సంవత్సరం పూర్తవుతోంది. ఎప్రిల్ 9 నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభం. ఈ ఏడాది  మీ రాశి ప్రకారం ఆదాయ వ్యయాలు ఇక్కడ తెలుసుకోండి.... 


మేష రాశి  :   అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఆదాయం: 8 , వ్యయం:14  , రాజపూజ్యం:4  , అవమానం:3


వృషభ రాశి  :  కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 7 అవమానం : 3


మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 3 అవమానం : 6


కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఆదాయం : 14 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 6 అవమానం : 6


Also Read: మనిషి జీవితంలో ముఖ్యమైన 16 ఘట్టాలివే - ఆ ఒక్కటీ మినహా మిగిలిన 15 మీ చేతిలోనే!


సింహ రాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆదాయం : 2 వ్యయం : 14 రాజ్యపూజ్యం:2 అవమానం : 2


కన్యా రాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 5 అవమానం : 2


తులా రాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం:1 అవమానం : 5


వృశ్చిక రాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదాలు 
ఆదాయం : 8 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 4 అవమానం : 5


ధనస్సు రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం 
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 7 అవమానం : 5


Also Read: ఫస్ట్ నైట్ కి ముహూర్తం ఎందుకు నిర్ణయిస్తారో తెలుసా!


మకర రాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 3 అవమానం : 1


కుంభ రాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 6 అవమానం : 1


మీన రాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం :2 అవమానం : 4


ఆదాయం అంటే సంపాదన, వ్యయం అంటే ఖర్చు, రాజపూజ్యం అంటే గౌరవం, అవమానం అంటే మీకు తెలుసు..
.
ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో ఎంతోకొంత మిగులుస్తారు


ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే సంపాదించిన దానికన్నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి


ఆదాయం, వ్యయం రెండూ సమానంగా ఉంటే ఈ చేత్తో సంపాదించిన మొత్తం ఆ చేత్తో ఖర్చుపెట్టేస్తారు- అంటే లాభం నష్టం రెండూ ఉండవు.


రాజపూజ్యం కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని తిట్టేవారికన్నా గౌరవించే వారి సంఖ్య ఈ ఏడాది ఎక్కువ ఉంటుంది


రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువ ఉంటే మిమ్మల్ని పొడిగేవారి కన్నా తిట్టేవారి సంఖ్యే ఎక్కువన్నమాట


రాజపూజ్యం-అవమానం సమానంగా ఉంటే ఎంతమంది మీకు అనుకూలంగా ఉంటారో అంతే వ్యతిరేకులున్నట్టు...


Also Read: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు - చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!
 
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ క్రోథినామ సంవత్సరం శుభాకాంక్షలు
 
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయని గుర్తించాలి...


Also Read: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది - రాముడు నవమి తిథిరోజే ఎందుకు జన్మించాడు!