Indonesia Flight: విమానం గాల్లో ఉంది... దాన్ని నడపాల్సిన పైలెట్‌తోపాటు కో-పైలెట్‌ ఒకేసారి గాఢ నిద్రలోకి వెళ్లారు. దీంతో విమానం దారి తప్పింది. అరగంట తర్వాత మేల్కొని చూసిన పైలెట్‌.. అరగంట తర్వాత మేల్కొని చూసిన పైలెట్‌.. విమానం నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్తున్నట్టు గమనించాడు. వెంటనే స్పందించి... సరైన మార్గంలోకి వెళ్లేలా చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే... విమానంలోని 153 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ప్రాణాల్లో చిక్కుల్లో పడేవి. ఇండోనేషియా (Indonesian)లో జరిగిన ఈ సంఘటన విమాన ప్రయాణికులను ఉల్లిక్కిపడేలా చేసింది. ఈ సంఘటనలో ఇద్దరు పెలట్లపై సస్పెన్షన్‌ (Suspension) వేటు వేశారు అధికారులు. 


కోపైలట్‌ అనుమతితో పైలట్ నిద్ర 
బాతిక్‌ ఎయిర్‌ (Batik Air) సంస్థకు చెందిన విమానం BTK6723... నలుగురు సిబ్బంది, 153 మంది ప్రయాణికులతో.. సౌత్‌ ఈస్ట్‌ సులవేసి (South East Sulawesi) నుంచి జకార్తా (Jakarta) వెళ్తోంది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో కోపైలట్‌ అనుమతితో పైలట్ (pilot) నిద్రపోయాడు. ఫ్లైట్‌ను నియంత్రణలోకి తీసుకున్న కో-పైలట్ (Co Pilot) కూడా.. నిద్రలోకి జారుకున్నాడు. దీంతో విమానం దారి తప్పింది. పైలట్లను సంప్రదించేందుకు జకర్తాలోని కంట్రోల్‌ సెంటర్‌ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సుమారు 28 నిమిషాల తర్వాత నిద్రలో నుంచి మేల్కొన్న ప్రధాన పైలట్‌‌.. విమానం దారి తప్పినట్టు గుర్తించాడు. తోటి పైలట్‌ను కూడా నిద్రలేపాడు. కంట్రోల్‌ సెంటర్‌ నుంచి వస్తున్న కాల్స్‌కు స్పందించాడు. వెంటనే... విమానాన్ని సరైన మార్గంలో పెట్టగలిగారు. ఫ్లైటను జకర్తాలో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. 


సిబ్బంది విశ్రాంతి సమయంపై ఎక్కువ శ్రద్ధ 
జనవరి 25న జరిగిన ఈ సంఘటనను ఇండోనేషియా రవాణా మంత్రిత్వ శాఖ(Indonesian Ministry of Transport) తీవ్రంగా పరిగణించింది. బాతిక్‌ ఎయిర్‌ సంస్థకు గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఈ ఘటనపై విచారణ చేపడతామని, స్థానికంగా అన్ని విమాన సేవల నిర్వహణ తీరును సమీక్షిస్తామని  ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ డైరెక్టర్ జనరల్ ఎం.క్రిస్టి ఎండా ముర్ని ప్రకటించారు. దీనిపై ఫిబ్రవరి 27ననేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా తాజాగా వచ్చింది. విమానానికి ముందు రోజు రాత్రి.... ఇద్దరు పైలట్లలో ఒకరు తన కవల శిశువులకు చికిత్స చేయించుకున్నారు. దీంతో ఆయన తగినంత విశ్రాంతి తీసుకోలేదని నివేదికలో పేర్కొంది. విమానయాన సంస్థలు తమ సిబ్బంది విశ్రాంతి సమయంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ఇండోనేషియా రవాణా శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు బాతిక్‌ ఎయిర్‌ సంస్థకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


బాతిక్‌ ఎయిర్‌... ఇండోనేషియా-ఆధారిత లయన్ ఎయిర్ గ్రూప్ అనుబంధ సంస్థ. దేశీయంగా, అంతర్జాతీయంగా సేవలు అందిస్తోంది. ప్రతిరోజూ దాదాపు 350 విమానాలను నడుపుతోంది. విధుల్లో నిద్రపోయిన ఇద్దరు పైలెట్ల విషయంలో బాతిక్‌ ఎయిర్‌ సంస్థ కూడా వివరణ ఇచ్చుకుంది. సిబ్బందికి తగినంత విశ్రాంతి ఇస్తున్నామని తెలిపింది. అంతేకాదు... అన్ని భద్రతా సిఫార్సులను కూడా అమలు చేస్తున్నట్టు కూడా స్పష్టం చేసింది. సస్పెండ్‌ అయిన ఇద్దరు పైలట్ల వివరాలు వెల్లడించలేదు. ఒక పైలట్‌ వయస్సు 32 సంవత్సరాలు కాగా.. మరో పైలట్‌ వయస్సు 28 సంవత్సరాలు. వీరిద్దరూ ఇండోనేషియా పౌరులే. ఇద్దరు పైలట్లను తాత్కాలికంగా సస్పెండ్‌ (Temporary suspension) చేసినట్టు ప్రకటించారు.