Sri Krodhi Nama Samvatsaram 2024 - 2025 Aries Yearly Horoscope : శ్రీ క్రోధి నామసంవత్సరంలో మేషరాశి ఫలితాలు

 

మేష రాశి  :   అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 

ఆదాయం: 8 , వ్యయం:14  , రాజపూజ్యం:4  , అవమానం:3

 

శ్రీ కోధి నామ సంవత్సరంలో మేష రాశివారికి గురుడు ధనస్థానంలో , శని 11 వ స్థానంలో , రాహు కేతువులు ఆరోస్థానంలో ఉన్నందున ఆదాయం బావుంటుంది. చేపట్టిన పనులపట్ల విజయం సాధిస్తారు. ఆలోచనా విధానం అద్భుతంగా ఉంటుంది. అయితే మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. హోదాలో ఉన్న వ్యక్తులు పరిచయమవుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అయితే ఎంత ఆదాయం వచ్చినా అంతే సులువుగా ఖర్చు చేసేస్తారు..చేతిలో డబ్బు నిలవదు. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. బంధువుల మరణవార్తలు వింటారు..ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీర్ఘంకాలంగా వెంటాడుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బావుంటుంది. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన ఈ ఏడాది కార్యరూపం దాల్చుతుంది. 

 


 

మేష రాశి ఉద్యోగులకు

ఈ రాశి ఉద్యోగులకు శని బలం కలిసొస్తుంది..అనుకున్న ప్రదేశాలకు బదిలీలు జరుగుతాయి. నిరుద్యోగులు ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది.  ఆదాయం ఒక్కసారిగా పెరుగుతుంది ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు కలిసొస్తాయి

 

మేష రాశి వ్యాపారులకు

క్రోధి నామ సంవత్సరం మేష రాశి వ్యాపారులకు అనుకూల సమయం. వ్యాపారంలో ఆశించిన లాభం పొందుతారు. నిర్మాణ రంగంలో ఉన్నవారికి విశేష లాభం. కిరాణా, హోటల్స్, చిరువ్యాపారులకు మంచి లాభాలొస్తాయి. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూల సమయం. బంగారం, వెండి వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి.

 

మేష రాశి కళాకారులకు

ఈ రాశి కళాకారులకు క్రోధి నామ సంవత్సరంలో గురుబలం బావుంది . ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతారు. సినిమా, టీవీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం బావుంటుంది. జీవితంలో స్థిరపడతారు. ప్రైవేటు ప్రభుత్వ సంస్థల నుంచి అవార్డులు పొందుతారు. 

 

రాజకీయ నాయకులకు

ఈ ఏడాది రాజకీయ నాయకులకు శనిబలం వల్ల కలిసొస్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధిస్తారు. ప్రజల్లో, అధిష్టాన వర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి పదవి పొందుతారు. ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోకతప్పదు...

 


 

విద్యార్థులకు

మేష రాశి విద్యార్థులకు గురుబలం బావుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఇతర వ్యాపకాలు ఉండవు. ఇంజినీరింగ్ , మెడికల్, లా సెట్, పాలిటెక్నిక్, బి.ఇ.డి...ఎంట్రన్స్ పరీశ్రక్షలలో మంచి ర్యాంకులు సాధిస్తారు. విద్యార్థులు కోరుకున్న కాలేజీలో సీట్లు పొందుతారు. క్రీడాకారులకు శనిబలం లాభిస్తుంది.

 

మేష రాశి స్త్రీలకు

ఈ రాశి స్త్రీలకు క్రోధి నామ సంవత్సరం అన్నీ శుభఫలితాలే. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలు పాటిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు జరుగుతాయి.

 

ఓవరాల్ గా చెప్పుకుంటే మేష రాశి స్త్రీపురుషులకు క్రోధి నామ సంవత్సరం యోగకాలం. గురు, శనిబలం బావుంటుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. 

 

పాటించాల్సిన నియమాలు

రాహుసంచారం వల్ల మంగళవారం నియమాలు పాటించాలి. శివాలయంలో అభిషేకం, రాహువు జపం చేసుకోవడం మంచిది. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడం వల్ల శుభఫలితాలు పొందుతారు

 

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.