Ugadi Panchangam Krodhi Nama Samvatsara 2024-2025  kandaya phalamulu
కందాయ ఫలాలు మూడు భాగాలుగా విభజించి చూస్తారు. నాలుగు నెలల చొప్పున డివైడ్ చేస్తారు. అంటే ఈ ఏడాది ఉగాది ఏప్రిల్లో కాబట్టి
ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు ఓ ఫలితం
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబరు నెలలకు మరో ఫలితం
డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి,మార్చి నెలలకు మరో ఫలితం

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి....
 (నక్షత్రం పక్కనే ఇచ్చిన మూడు ఫలితాల్లో ఉన్న సరి, బేసి, సున్నా ఆధారంగా మొదటి నాలుగు నెలలు, రెండో నాలుగు నెలలు, చివరి నాలుగు నెలలు మీరు ఎలాంటి ఫలితాలు ఉంటాయని అర్థం)

 నక్షత్రం             కందాయ ఫలం

అశ్వని     2  1  0
  భరణి         5 2 2
 కృత్తిక           0 0 4
రోహిణి        3 1 3
మృగశిర     6 2 3
ఆరుద్ర      1 0 0
పునర్వసు   4 1 2
పుష్యమి     7 2 4
ఆశ్లేష         2  0 1
మఖ          5 1 3
పూర్వఫల్గుణి    0 2 0
ఉత్తరఫల్గుణి     3 0 2
హస్త         6 1 4
చిత్త         1 2 1
స్వాతి      4 0 3
విశాఖ         7 1 0
అనూరాధ       2 2 2
జ్యేష్ట            5 0 4
మూల            0 1 1
పూర్వాషాఢ      3 2 3
ఉత్తరాషాఢ       6 0 0
శ్రవణం          1 1 4
ధనిష్ట           4 2 2
శతభిషం        7 0 1
పూర్వాభాద్ర    2 1 3
ఉత్తరాభాద్ర      5 2 0
రేవతి              0 0 2

Also Read: ఈ వారం (మార్చి 10 - 16) ఈ రాశులవారిని గ్రహబలం కాదు మనోధైర్యమే నడిపిస్తుంది!

ఫలితాలు 3 రకాలుగా ( సరి, బేసి, శూన్య(సున్నా)) ఉంటాయి..వీటినే కందాయ ఫలాలు అంటారు
1. కందాయ ఫలాల్లో బేసి సంఖ్య ఉంటే ధనలాభం
2. కందాయ ఫలాల్లో సరి సంఖ్య ఉంటే సమఫలం
3. కందాయ ఫలాల్లో సున్నా ఉంటే శూన్య ఫలితం
4. మొదటి ఫలితం సున్నా ఉంటే మొదటి నాలుగు నెలలు భయాందోళను వెంటాడుతాయి
5. మధ్యలో ఫలితం సున్నా ఉంటే బుణబాధలు, అవమానాలు తప్పవు
6. చివర్లో సున్నా ఉంటే ధననష్టం, శత్రుభయం ఉంటుందని అర్థం

మీ నక్షత్రం ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

2024 ఏప్రిల్ 09 ఉగాది 
ఏప్రిల్ 08 సోమవారం కొత్త అమావాస్యతో శోభకృత్ నామ సంవత్సరం పూర్తవుతుంది... ఎప్రిల్ 9 మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది.

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.