Shardiya Navratri Fourth Day Srishaila Bhramarambi in Kushmanda Devi Alankaram
నవదుర్గ శ్లోకం
ప్రథమా శైలపుత్రీచ|ద్వితీయా బ్రహ్మచారిణీ|
తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|
పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|
సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|
నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా||
నవరాత్రుల్లో నాలుగో రోజున కూష్మాండ దేవిని పూజిస్తే దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఏడాది (2024) శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైల భ్రమరాంబిక అక్టోబరు 06 ఆదివారం కూష్మాండ దుర్గ అలంకారంలో దర్శనమిస్తోంది.
Also Read: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!
కు - అంటే చిన్న
ఊష్మ - అంటే శక్తి
అండా - అంటే విశ్వం
తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిన తల్లి అని అర్థం. కూష్మాండ దుర్గను పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తి లభిస్తాయి.
కూష్మాండ దుర్గ తేజస్సే సూర్యుడు అని అంటారు..అందుకు ప్రతీకగా కూష్మాండ దేవి సూర్యుడిని ధరించి కనిపిస్తుంది.
పులివాహనంపై కూర్చుని దర్శనమిస్తే కూష్మాండ దుర్గ..8 చేతుల్లో బాణం, చక్రం, గద, తామరపువ్వు, విల్లు, జపమాల, కమండలం,అమృత కలశం ఉంటుంది. అమ్మవారికి కూష్మాండ (గుమ్మడి కాయ) బలి ప్రీతికరం.
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే
'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '
త్రిమూర్తులు, త్రిమాతల శక్తి కలిపితే కుష్మాండా దుర్గాదేవి.
కూష్మాండ దుర్గ ఎడమ కంటి కాంతి నుంచి ఉద్భవించిన రూపం మహాకాళి.
ఈ రూపం ఉగ్రస్వరూపం. మహాకాళికి పది తలలు, చిందరవందర జుట్టుతో నాలుక బయటపెట్టి..మండుతున్న చితిపై కూర్చుని కనిపిస్తుంది. త్రిశూలం, చక్రం, బాణం, డాలు, రాక్షసుని తల, పుర్రె, నత్త గుల్ల, ధనువు, కర్ర ధరించి ఉగ్రస్వరూపంతో కనిపిస్తుంది కాళీ.
కూష్మాండ దుర్గాదేవి మూడో కంటి నుంచి ఉద్భవించిన రూపం మహాలక్ష్మి
బంగారు వర్ణంలో 18 చేతులతో ఉండే ఈ రూపంలో అమ్మవారు కాషాయ రంగు వస్త్రాలు, కవచం, కిరీటం ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది.
కూష్మాండదేవి కుడి కంటి కాంతి నుంచి ఉద్భవించిన రూపం మహా సరస్వతి
శాంతమూర్తి అయిన తెల్లని శరీర ఛాయ కలిగిన మహా సరస్వతి..తెల్లటి వస్త్రాలు ధరించి తలపై చంద్రవంకతో దర్శనమిస్తుంది. 8 చేతుల్లో త్రిశూలం, చక్రం, ఢమరుకం, నత్తగుల్ల, ఘంట, విల్లు, నాగలి ఉన్నాయి.
Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!
కూష్మాండ దేవి దృష్టి మహాకాళిపై పడినప్పుడు పురుషుడు ఉద్భవించారు
మెడలో పాము, పులిచర్మం ధరించిన ఆ రూపానికి శివుడు అని పేరుపెట్టింది అమ్మవారు. ఆచేతుల్లో గొడ్డలి, బాణం, ధనువు, త్రిశూలం, పిడుగు, కపాలం, ఢమరుకం, జపమాల, కమండలం ఉన్నాయి.
కూష్మాండ దేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుంచి ఉద్భవించిన రూపం బ్రహ్మ
నాలుగు ముఖాలతో, నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో తామరపువ్వుపై కూర్చుని ఉంటాడు బ్రహ్మ.
విశ్వానికి అధిపతి అయిన కూష్మాండదుర్గ రూపాన్ని నవరాత్రుల్లో ఆరాధిస్తే దీర్ఘాయువు లభిస్తుందంటారు..
Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం
నవరాత్రుల్లో నాలుగోరోజు ఉపాసకుడి మనసు అనాహత చక్రంలో స్థిరం అవుతుంది..ఈ రోజు నిశ్చలమైన భక్తితో కూష్మాండ శక్తి రూపాన్ని పూజించాలి