Maoists Killed In Encounter At Dantewada Border In Chhattisgarh | ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ, నారాయణపూర్ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టుల వివరాలను పోలీసులు ప్రకటించారు. 31 మంది సాయుధ యూనిఫాం ధరించిన మావోయిస్టులు చనిపోగా, వారిలో 18 పురుషులు, 13 మహిళలు ఉన్నారని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల ఎస్పీలు తెలిపారు. నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ అడవుల్లో నెందుర్, తుల్తులి గ్రామాల్లో మావోయిస్టులకు, పోలీస్ బలగాలకు మధ్య 15 గంటలపాటు భీకర కాల్పులు జరిగాయి.
ఈ భారీ ఎన్ కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారని పోలీసులు శనివారం నాడు మీడియాకు వివరాలు తెలిపారు. వీరితోపాటు పెద్ద సంఖ్యలో నక్సలైట్లు గాయపడే అవకాశం ఉందన్నారు. చనిపోయిన వారిలో DKSZC 25 లక్షల రివార్డు, తూర్పు బస్తర్ ఇంచార్జి నీతి అలియాస్ ఊర్మిళ ఉన్నారని తెలిపారు. చనిపోయిన వారిలో 16 మంది నక్సలైట్లను గుర్తించామని.. ఈ 16 మంది నక్సలైట్లపై రూ. 1 కోటి 30 లక్షల రూపాయలకు పైగా రివార్డు ఉందని గుర్తించారు. మరో 15 మంది నక్సలైట్ల గుర్తింపు కోసం చర్యలు చేపట్టారు. మృతదేహాలను నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు.
హతమైన నక్సలైట్ల వివరాలు
1. నీతి, DKSZC
2. సురేష్ సలాం, DVCM
3. మీనా మడకం, DVCM
4. అర్జున్ PPCM, PLGA కంపెనీ 6
5. సుందర్ PPCM, PLGA కంపెనీ 6
6. బుధ్రామ్, PPCM PLGA కంపెనీ 6
7. సుక్కు, PGAPCM కంపెనీ
8. సోహన్, ACM, బర్సూర్ AC
9. ఫూలో, PPCM, PLGA కంపెనీ 6
10. బసంతి, PPCM, PLGA కంపెనీ 6
11. కొన్ని, PPCM, PLGA కంపెనీ 6
12. జమీలా అలియాస్ బుద్రి, PM, PLGA కంపెనీ 6
13 . ACM
14. సుక్లు అలియాస్ విజయ్ ACM
15. జమ్లీ ACM
16. సోను కొర్రమ్, ACM ఆమ్దేయి
ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో ఏకే-47, ఎస్ ఎల్ ఆర్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఎలాంటి ప్రాణనష్టం జరలేదు. ఒకరిద్దరు పోలీసులు గాయపడగా, వారికి చికిత్స అందిస్తున్నారు. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతోనే డీఆర్జీ, పారామిలటరీ బలగాలు, స్థానిక పోలీసు బలగాలతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించి వారి రహస్య స్థావరంపై దాడి చేశారు. ఏం జరిగింతో తెలుసుకునేలోపే పోలీసుల బలగాలు తమ టార్గెట్ పూర్తి చేశాయని ఉన్నతాధికారులు వివరించారు.
నక్సలైట్ భావజాలాన్ని విడనాడాలని దంతేవాడ ఎస్పీ పిలుపు
దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ మాట్లాడుతూ.. తూర్పు బస్తర్ డివిజన్ లో అడవులు, కఠినమైన భౌగోళిక పరిస్థితులలో నివసించే సామాన్యులను నక్సలైట్ భావజాలం నుంచి కాపాడుతున్నాం. వారిని మావోయిస్టు సిద్ధాంతాల నుంచి బయటపడేయడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి, శాంతిని కొనసాగించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా చెబు ప్రభావంతో నక్సలిజం, నక్సలైట్ భావజాలానికి ఆకర్షితులవుతున్న వారిని, ప్రభుత్వ లొంగుబాటు పునరావాస విధానాన్ని అవలంబించినట్లు తెలిపారు. నక్సలైట్ భావజాలాన్ని పూర్తిగా విడనాడాలని, సాధారణ పౌరుల్లా స్వేచ్ఛగా బతకాలని పిలుపునిచ్చారు.