Indian Forest Service (Mains) Examination 2024: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) - 2024 మెయిన్ పరీక్షల తేదీలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 5న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. నవంబరు 24న ప్రారంభమై.. డిసెంబరు 1తో ముగియనున్నాయి. ఆయాతేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. దేశంలోని వివిధ పట్టణాలు/నగరాల్లో ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు.  



 IFS మెయిన్ పరీక్ష షెడ్యూలు, పరీక్ష విధానం..
ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్‌తోపాటు రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లలో నాలుగు పేపర్లు మొత్తంగా ఆరు పేపర్లలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.


➥ నవంబరు 24 
జనరల్‌ ఇంగ్లిష్‌ - 300 మార్కులు
జనరల్‌ నాలెడ్జ్‌ - 300 మార్కులు


➥ నవంబరు 26  
పేపర్-1 (మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/జువాలజీ)- 200 మార్కులు
పేపర్-2 (మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/జువాలజీ)- 200 మార్కులు


➥ నవంబరు 27
పేపర్-1 (సివిల్ ఇంజినీరింగ్/బోటనీ)- 200 మార్కులు
పేపర్-2 (సివిల్ ఇంజినీరింగ్/బోటనీ)- 200 మార్కులు


➥ నవంబరు 28
పేపర్-1 (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ఏనిమల్ హస్బెండరీ & వెటర్నరీ సైన్స్/ఫిజిక్స్)- 200 మార్కులు
పేపర్-2 (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ఏనిమల్ హస్బెండరీ & వెటర్నరీ సైన్స్/ఫిజిక్స్)- 200 మార్కులు


➥ నవంబరు 29
పేపర్-1 (అగ్రికల్చర్/ఫారెస్ట్రీ)- 200 మార్కులు
పేపర్-2 (అగ్రికల్చర్/ఫారెస్ట్రీ)- 200 మార్కులు


➥ నవంబరు 30
పేపర్-1 (జియోలజీ)- 200 మార్కులు
పేపర్-2 (జియోలజీ)- 200 మార్కులు


➥ డిసెంబరు 1
పేపర్-1 (కెమిస్ట్రీ/కెమికల్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్)- 200 మార్కులు
పేపర్-2 (కెమిస్ట్రీ/కెమికల్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్)- 200 మార్కులు


పేపర్ ఎంపిక ఇలా..
★ అభ్యర్థులు ఏవైనా రెండు సబ్జెక్ట్‌లను ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకోవాలి. ఇలా ఎంపిక చేసుకున్న రెండు సబ్జెక్ట్‌ల నుంచి ఒక్కో దానిలో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తారు. 
★ ఆప్షనల్స్‌ ఎంపికకు సంబంధించి నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్ట్‌లను పేర్కొన్నారు. అభ్యర్థులు ఆ జాబితాలోని సబ్జెక్ట్‌లనే ఆప్షనల్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది.
★ అంతేకాకుండా ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ల ఎంపిక విషయంలో కొన్ని సబ్జెక్ట్‌ కాంబినేషన్లను అనుమతించరు.


ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ల వివరాలు..
➥ అగ్రికల్చర్‌; అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌; యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌; బోటనీ; కెమిస్ట్రీ; కెమికల్‌ ఇంజనీరింగ్‌; సివిల్‌ ఇంజనీరింగ్‌; ఫారెస్ట్రీ; జియాలజీ; మ్యాథమెటిక్స్‌; మెకానికల్‌ ఇంజనీరింగ్‌; ఫిజిక్స్‌; స్టాటిస్టిక్స్‌; జువాలజీ.
➥ అగ్రికల్చర్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌; –అగ్రికల్చర్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌; –అగ్రికల్చర్‌ అండ్‌ ఫారెస్ట్రీ; –కెమిస్ట్రీ అండ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌; –మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌.
➥ ఇంజినీరింగ్‌ అభ్యర్థులు.. ఏదైనా ఒక ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌నే ఆప్షనల్‌గా ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. రెండో ఆప్షనల్‌గా.. వేరే విభాగాల్లోని సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి.


ప్రత్యేకంగా రెండు ఆప్షనల్స్‌.. 
➥ ఐఎఫ్‌ఎస్‌ అభ్యర్థులు పరీక్ష విధానంలో భాగంగా రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. వాటి నుంచి నాలుగు పేపర్లకు హాజరవ్వాల్సి ఉంటుంది. అంటే.. ఆప్షనల్‌ పేపర్లకు అధిక వెయిటేజీ ఉందనే విషయం స్పష్టం. కాబట్టి ఇప్పటి నుంచే ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లపై పట్టు సాధించే విధంగా నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలి.
➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక ఆప్షనల్‌ను తమ అకడమిక్‌ సబ్జెక్ట్‌ల ఆధారంగా పేపరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరో ఆప్షనల్‌ పూర్తిగా కొత్త సబ్జెక్ట్‌ ఉంటుంది. ఎందుకంటే.. ఒకే స్వరూపం ఉండే సబ్జెక్ట్‌లను ఆప్షనల్స్‌గా తీసుకోకూడదనే నిబంధన ఉంది. ఉదాహరణకు.. అగ్రికల్చర్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. రెండో ఆప్షనల్‌గా అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకునే వీలు లేదు. అదే విధంగా బీటెక్‌ అర్హతతో పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు రెండు ఆప్షనల్స్‌ను ఇంజనీరింగ్‌ నేపథ్యం సబ్జెక్ట్‌ల నుంచి ఎంపిక చేసుకునే అవకాశం లేదు. అభ్యర్థులు ముందుగా తమ అకడమిక్‌ నేపథ్యానికి సంబంధంలేని, కొత్తగా ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌తో మెయిన్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించాలి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..