Kerala Government Key Decision On Sabarimala Ayyappa Darshanam: శబరిమల (Sabarimala) అయ్యప్ప దర్శనానికి సంబంధించి కేరళ ప్రభుత్వం (Kerala Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది స్వామి దర్శనం కోసం ఆన్ లైన్ బుకింగ్ ద్వారానే భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు శనివారం కీలక ప్రకటన చేసింది. మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్ ప్రారంభం కానున్న వేళ ఈ నిర్ణయం వెలువరించింది. రోజుకు గరిష్టంగా 80 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలో.. యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని సైతం ఎంచుకునే అవకాశం ఉందని సీఎంవో తెలిపింది. తీర్థయాత్రల సన్నాహాలను సమీక్షించేందుకు సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.


సాధారణంగా మకరవిళక్కు సీజన్‌లో శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అటవీ మార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. శబరిమలకు వెళ్లే మార్గంలో రోడ్లు, దాని చుట్టూ పార్కింగ్ నిర్వహణ పనులు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. అటవీ మార్గంలో వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక అతిథి గృహ నిర్మాణం పూర్తైందని.. త్వరలో మరొకటి పూర్తి కానుందని వెల్లడించారు.


Also Read: Viral News: సముద్రతీరాల్లో విచిత్ర వెలుగులు: అరేబియా తీరంలో మెరిసే భారత బీచ్‌లు ఇవే