మైథలాజికల్ మూవీస్ ఇటీవల కాలంలో భారీ విజయాలు సాధిస్తున్నాయి. హిందీ సినిమా 'బ్రహ్మాస్త' నుంచి మొదలు పెడితే సౌత్ ఇండస్ట్రీలో 'కాంతార', 'హను మాన్' వరకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో శ్రద్ధా దాస్ సినిమా కూడా చేరుతుందేమో చూడాలి. ఆవిడ ఓ ప్రధాన పాత్రధారిగా మైథలాజికల్ టచ్ ఉన్న భారీ సినిమా రూపొందుతోంది.
'త్రికాల' టైటిల్ పోస్టర్ విడుదల చేసిన 'దిల్' రాజు
శ్రద్ధా దాస్ (Shraddha Das), అజయ్, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న సినిమా 'త్రికాల' (Trikaala Movie). స్క్రిప్ట్ ఆఫ్ గాడ్... అనేది ఉప శీర్షిక. రిత్విక్ సిద్ధార్థ్ సమర్పణలో మినర్వా పిక్చర్స్ పతాకం మీద రూపొందుతోన్న ఈ చిత్రానికి మణి తెల్లగూటి దర్శకుడు. రాధికా శ్రీనివాస్ నిర్మాత. శ్రీ సాయి దీప్ చాట్ల, వెంకట్ రమేష్ దాడి, ఓంకార్ పవన్ సహ నిర్మాతలు.
'త్రికాల' సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు చేతుల మీదుగా విడుదల అయ్యింది.
విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ బేస్డ్ సినిమా!
విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ బేస్డ్ సినిమా 'త్రికాల' అని దర్శక నిర్మాతలు మణి తెల్లగూటి, రాధికా శ్రీనివాస్ ప్పారు. అతి త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని వివరించారు.
Also Read: మెగా హీరో సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కటౌట్... 'మట్కా' టీజర్‌లో ఆ షాట్ గమనించారా?
''భారీ నిర్మాణ వ్యయంతో ఫాంటసీ, హారర్ జోనర్ అంశాలతో కుమారి ఖండం నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, ఈ తరానికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించిన చిత్రమిది. కుమారి ఖండాన్ని పరిచయం చేస్తూ... మూల కథకు పురాణ నేపథ్యం, కమర్షియల్ హంగులతో సినిమా చేశాం. 'దేవి'తో పాటు పలు సినిమాల్లో బాల నటుడిగా మెప్పించిన 'మాస్టర్' మహేంద్రన్ (Master Mahendran)ను ఈ సినిమాతో మెయిన్ లీడ్ పాత్రలో పరిచయం చేస్తున్నాం'' అని యూనిట్ సభ్యులు చెప్పారు.
Also Read: ఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?
Trikaala Movie Cast And Crew: శ్రద్ధా దాస్, అజయ్, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రలు పోషితున్న ఈ సినిమాలో సాహితి ఆవంచ, తనికెళ్ళ భరణి, ఆమని, అర్జున్ అంబటి, ఐశ్వర్య, సాయి దీన, రవి వర్మ, రోహిణి, టీవీ స్టార్ యాదం రాజు, దేవి ప్రసాద్, నంద దురసిరాజ్, వాసు విక్రమ్, దయానంద్, 'ఛత్రపతి' శేఖర్, హేమంత్, 'షిఫ్' వెంకట్, శ్రీసుధ, జీవా, సూర్య, 'ఈ టీవీ' ప్రభాకర్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పవన్ చెన్నా, పాటలు: రాకేందు మౌళి - కడలి - వివేక్ వేల్ మురుగన్, స్వరాలు: హర్షవర్ధన్ రామేశ్వర్, నేపథ్య సంగీతం: షాజిత్ హుమయూన్, నృత్య దర్శకత్వం: సుచిత్రా చంద్రబోస్ - మొయిన్, సహ నిర్మాతలు: శ్రీ సాయి దీప్ చాట్ల - వెంకట్ రమేష్ దాడి - ఓంకార్ పవన్, సమర్పణ: రిత్విక్ సిద్ధార్థ్, నిర్మాణ సంస్థ: మినర్వా పిక్చర్స్, నిర్మాత: రాధికా శ్రీనివాస్, దర్శకత్వం: మణి తెల్లగూటి.