ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కొందరు వారసులే. నందమూరి, అక్కినేని, ఘట్టమనేని, దగ్గుబాటి, కొణిదెల... కుటుంబాల వారసులు హీరోలుగా మంచి స్థాయిలో ఉన్నారు. వారసుల సినిమాల్లో తమ ముందు తరం కథానాయకుల కీర్తి ప్రతిష్ఠలను చూపించే సన్నివేశాలు ఉండటం సహజం. బట్, ఫర్ ఏ ఛేంజ్... మెగా ఫ్యామిలీ హీరో సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కటౌట్ ఉంది. మీరు అది గమనించారా?
'మట్కా' సినిమాలో సీనియర్ ఎన్టీఆర్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా 'మట్కా' రూపొందుతోంది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. ఈ సినిమా 'మట్కా' ఆట ఆధారంగా విశాఖ నేపథ్యంలో తెరకెక్కుతోంది. కథ కూడా ఈ కాలంలో జరిగేది కాదు... 1960 - 90, దశాబ్దాల్లో జరిగేది. ఆ వింటేజ్ లుక్, ముఖ్యంగా వరుణ్ తేజ్ ట్రాన్స్‌ఫర్మేషన్... టీజర్ ఆకట్టుకుంటోంది. అయితే, అన్నిటి కంటే ముఖ్యంగా అందులో సీనియర్ ఎన్టీఆర్ కటౌట్ ఒకటి ఉంది. అది చూశారా?
విశాఖలో పూర్ణ టాకీస్ (థియేటర్) అంటే ఐకానిక్ లొకేషన్. 'మట్కా'లో ఆ థియేటర్ ప్రస్తావన ఉంది. ముఖ్యంగా ఆ థియేటర్ ముందు వరుణ్ తేజ్ ఓ ఫైట్ కూడా చేస్తారు. ఆ టైంలో వెనుక సీనియర్ ఎన్టీఆర్ కటౌట్ కనబడుతుంది. ఆ కటౌట్ ఏ సినిమాలో ఎన్టీఆర్ గెటప్ స్ఫూర్తితో రూపొందించారో తెలుసా? 'మంగమ్మ శపథం'! అవును... ఆ సినిమా గెటప్ అది!
'మంగమ్మ శపథం' విడుదల అయ్యే సమయానికి మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి రాలేదు. ఆ కటౌట్ వచ్చే సీన్ టైమ్ పీరియడ్ ఆ సినిమా విడుదలైన రోజుల్లోది అయ్యి ఉండొచ్చు. బహుశా... వరుణ్ తేజ్ ఓల్డ్ ఏజ్ గెటప్ సన్నివేశాలు వచ్చే సమయంలో చిరు కటౌట్స్ వంటివి ఏమైనా ప్లాన్ చేశారేమో చూడాలి.
వరుణ్ తేజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సూపర్!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ వరుణ్ తేజ్ సినిమాలు చేస్తున్నారు. అయితే, ఆయనకు 'గాంఢీవధారి అర్జున', 'ఆపరేషన్ వేలంటైన్' ఆశించిన విజయాలు సాధించలేదు. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్స్ అయ్యాయి. అయితే... 'మట్కా' టీజర్ చూశాక, వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ కొట్టడం గ్యారంటీ అనిపిస్తోంది. 'మట్కా' టీజర్ లెంగ్త్ 120 సెకన్స్ మాత్రమే... అయితే, ఆ సమయంలో ఆయన లుక్స్ / గెటప్స్ పరంగా వేరియేషన్ చూపించారు.
Also Read: ఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?
'విశాఖ పట్టణం అంటే ఒకటి సముద్రం గుర్తుకు రావాలి లేదా ఈ వాసు గుర్తుకు రావాలి', 'ధర్మం... మనకు ఏది అవసరమో అదే ధర్మం. మనిషిలో ఆశ చావని అంత వరకు నా యాపరానికి సావు ఉండదు' అని వరుణ్ తేజ్ చెప్పే డైలాగులు బావున్నాయి. ముఖ్యంగా రింగుల జుట్టులో ఆయన గెటప్ ఇండస్ట్రీలో చిరంజీవి ఎర్లీ డేస్ గుర్తు చేసేలా ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నవంబర్ 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, నోతా ఫతేహి హీరోయిన్లు.
Also Read: చైతన్య, నాగార్జునను అవమానించి సమంతకు సారీ చెప్పడం ఏమిటి? - లాజిక్ బయటకు తీసిన వర్మ