Bioluminescence Phenomenon in Seashores | ప్రకృతి సౌందర్యాలలో సముద్రతీరాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో కొన్ని సముద్రతీరాలు రాత్రివేళల్లో విచిత్రమైన కాంతులు విరజిమ్ముతూ సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రకృతి ప్రేమికులు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ మెరిసే బీచ్‌లను చూడాలనుకుంటారు. ఈ కాంతుల వెనుక కారణం బయోల్యుమినెసెన్స్ అనే సహజ శాస్త్రీయ ప్రక్రియ.


కాంతి ఉత్పత్తి చేసే ప్రక్రియ 
బయోల్యుమినెసెన్స్ అనేది సముద్రంలో ఉండే కొన్ని సూక్ష్మ జీవులు శరీరంలో కాంతి ఉత్పత్తి చేసే ప్రక్రియ. సముద్రంలో నివసించే డైనోఫ్లాజెల్లేట్స్ (Dinoflagellates) అనే సూక్ష్మజీవులు రసాయన చర్యల ద్వారా వెలుతురును సృష్టిస్తాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో ఈ వెలుతురు ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా సముద్రపు అంచుల్లో ఈ ప్రకాశం పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఈ కాంతి వల్ల సముద్ర తీరాల్లో రాత్రిపూట తెల్లటి వెలుగులు విరజిమ్మేటట్టు చేస్తుంది. ఇది ప్రకృతి అందించిన అద్భుతం.


శాస్త్రీయ విశ్లేషణ:


ఈ వెలుతురుకు కారణం సముద్రపు నీటిలో నివసించే ఫైటోప్లాంక్టన్ సూక్ష్మజీవులు. ఇవి జీవ రసాయన చర్యల ద్వారా కాంతిని ఉత్పత్తి చేస్తాయి. ముఖ్యంగా సముద్రపు అంచుల్లో కనిపించే ఈ కాంతి పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తుంది.


రాత్రివేళల్లో వెలుగులు విరజిమ్మే ఐదు బీచ్‌లు:


1. వర్కల బీచ్, కేరళ: కేరళలోని వర్కల బీచ్ ప్రకృతి ప్రేమికులు తరచుగా సందర్శించే ప్రసిద్ధి చెందిన బీచ్. ఇక్కడ రాత్రిపూట సముద్రం నీలి కాంతితో మెరిసిపోతుంది. వర్కల బీచ్‌లోని ఎత్తైన కొండచరియల నుంచి ఈ అద్భుతాన్ని వీక్షించడం ప్రత్యేకమైన అనుభవం. ఇది కేరళలోని ఏకైక క్లిఫ్ బీచ్ కావడం విశేషం. పర్యాటకులు ఈ మెరిసే సముద్రం చూస్తూ ప్రశాంతంగా రాత్రిని ఆస్వాదిస్తారు.


2. పలోలెం బీచ్, గోవా: పలోలెం బీచ్ గోవాలోని ప్రసిద్ధ బీచ్‌లలో ఒకటి. ఈ బీచ్ ప్రత్యేకత రాత్రివేళల్లో బయోల్యుమినెసెన్స్. ఫైటోప్లాంక్టన్‌ల వెలుతురు సముద్రంలో మెరిసిపోతూ పర్యాటకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. రాత్రి వేళల్లో సముద్రపు అంచుల్లో మెరిసే కాంతిని చూస్తూ గోవా సౌందర్యాన్ని ఆస్వాదించడం అద్భుతమైన అనుభవం.




3. మట్టు బీచ్, ఉడిపి: కర్ణాటక లోని ఉడిపిలో మట్టు బీచ్ చాలా ఫేమస్. రాత్రివేళల్లో ఇక్కడ సముద్రం ప్రత్యేకమైన వెలుతురుతో మెరిసిపోతుంది. ఈ బీచ్‌ లో సాయంకాలం రద్దీ తక్కువగా ఉంటుంది. కావున పర్యాటకులు ఈ వెలుతురును ప్రశాంతంగా ఆస్వాదించవచ్చు. 


4. కాసర్కోడ్ బీచ్, కర్ణాటక: ఉత్తర కన్నడలోని కాసర్కోడ్ బీచ్ పర్యాటకుల తక్కువ రద్దీతో ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది. రాత్రి వేళల్లో సముద్రపు అంచుల్లో మెరిసే నీలి కాంతి ఈ బీచ్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. సముద్రతీరం చుట్టు పక్కల పచ్చని వృక్ష సంపదతో కూడిన ఈ ప్రాంతం పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందిస్తుంది.


5. వెర్సోవా బీచ్, అలిబాగ్: ముంబై సమీపంలోని వెర్సోవా బీచ్ సాధారణంగా రద్దీగా ఉంటుంది. అయితే రాత్రివేళల్లో ఇక్కడ అలలు ఫైటోప్లాంక్టన్‌ల కాంతితో మెరిసిపోతాయి. ఈ కాంతులు పర్యాటకులకు ఒక అరుదైన అనుభవాన్ని అందిస్తుంది. ముంబై పర్యటన సమయంలో ఈ బీచ్ తప్పక సందర్శించాల్సిన ప్రదేశం.


Also Read: Viral News: ఆ ఊర్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు, అందరికీ రుచికరమైన ఆహారం- ఈ స్పెషల్ విలేజ్ ఎక్కడుందో తెలుసా?