Does India have an Iron Dome : ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మూడో ప్రపంచయుద్ధం ముంచుకు వచ్చేస్తుందేమోనని చాలా మంది భయపడుతున్నారు. అన్ని దేశాలు తమ దేశ ప్రజలను సురక్షితంగా ఉంచడానికి అత్యాధునిక రక్షణ పద్దతులు పాటించాల్సిన అవసరం ఏర్పడుతోంది. తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో కొత్త రకమైన చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అద్భుతంగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆ దేశం తరహాలో మన దేశలోనూ ఐరన్ డోమ్ ఉండాలని.. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ చెప్పారు. లడఖ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటున్నాయన్నారు. చైనా వేగంగా ఎయిర్ స్ట్రిప్‌లు నిర్మిస్తోందని..భారత్ కూడా మౌలిక సదుపాయాలు పెంచుకోవాల్సి ఉందన్నారు. 


ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థల్లో ఐరన్ డోమ్ కీలకమైనది. ఐరన్  డోమ్ అంటే.. దేశం మొత్తం ఐరన్ డోమ్ కట్టడం కాదు.  తమ దేశం వైపు దూసుకు వస్తున్న క్షిపణిని   రాడార్ సిస్టమ్ వెంటనే దానిని గుర్తించి అది వచ్చే మార్గాన్ని ట్రాక్ చేస్తుంది. ఈ సమాచారం రక్షణ వ్యవస్థకు చేరుతుంది. ఆ మిస్సైల్ వల్ల ఎంత నష్టం జరుగుతుందో వెంటే విశ్లేషిస్తుంది. క్షిపణి జనావాసాలు లేని ప్రాంతంలో ల్యాండ్ అవుతుందని అంచనా వేస్తే వదిలేస్తారు ఎందుకంటే ఆ మిస్సైల్ ను నిర్వీర్యం చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఒక వేళ ఆ మిస్సైల్ వల్ల నష్టం జరుగుతుందని ఐరన్ డోమ్ వ్యవస్థ గుర్తిస్తే వెంటనే  సిస్టమ్ దాని రెస్పాన్స్ మెకానిజంను యాక్టివేట్ చేస్తుంది.                  


బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించిన కెనడియన్‌- కట్టుబట్టలతో నిల్చుండిపోయిన ఎన్‌ఆర్‌ఐ


తమ దేశం వైపు వస్తున్న మిస్సైల్ వల్ల  ముప్పు ఉన్నట్లు గుర్తించినట్లయితే,ఐరన్ డోమ్  ఇంటర్‌సెప్టర్ మిసైల్‌ను ప్రయోగిస్తుంది. ఈ క్షిపణులు  అధునాతన గెడెన్స్ సిస్టమ్ కలిగి ఉంటాయి. వాయు మార్గంలోనే తమ దేశం వైపు దూసుకు వస్తున్న క్షిపణుల్ని పేల్చేస్తాయి. రాకెట్ లేదా షెల్‌ను నేలపై పడక ముందే నాశనం చేస్తాయి.ఐరన్ డోమ్ వ్యవస్థకు ఉండే రాడార్లు... ఆ దేశ గగనతలంలోకి దూసుకొస్తున్న రాకెట్లను గుర్తిస్తాయి. ఆ రాకెట్లను ధ్వంసం చేసేందుకు ఐరన్ డోమ్ క్షిపణులను ఉపయోగిస్తుంది. 



Also Read:మొన్న హమాస్, నిన్న హిజ్బుల్లా, నేడు ఇరాన్- రేపు ఇజ్రాయెల్ లక్ష్యం ఎవరు?