Smartphones Under 10K: భారతదేశంలో చవకైన స్మార్ట్‌ఫోన్‌లకు చాలా డిమాండ్ ఉంది. ప్రజలు తక్కువ ధరలలో గొప్ప ఫీచర్లు ఉన్న ఫోన్‌లను ఇష్టపడతారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వాడే వారికి స్టోరేజ్ చాలా కీలకం. ఫొటోలు, వీడియోలు, యాప్స్ అన్నీ డిలీట్ చేయకుండా ఉంచుకోవడానికి స్టోరేజ్ చాలా ముఖ్యం. కేవలం రూ.10 వేలలోపు 256 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉన్న ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఇన్‌ఫీనిక్స్, ఐటెల్ కంపెనీల ఫోన్లు ఉన్నాయి.


ఐటెల్ ఏ70 (itel A70)
ఈ స్మార్ట్‌ఫోన్ 4 జీబీ ర్యామ్ + 256 జీబీ వేరియంట్ ధర రూ.7,299గా ఉంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.6 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. పవర్ కోసం ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌లో ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు.


ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ (Infinix HOT 40i)
ఈ ఇన్‌ఫీనిక్స్ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే అందుబాటులో ఉంది.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


ఐటెల్ పీ55 ప్లస్ (itel P55 Plus)
ఐటెల్ లాంచ్ చేసిన ఈ ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ అని అనుకోవచ్చు. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ. 8,999గా నిర్ణయించారు. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.


ఈ ఫోన్ 6.6 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. పవర్ కోసం ఇందులో మోస్ట్ పవర్‌ఫుల్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. 


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే