Haryana Election Exit Polls LIVE Updates: హర్యానా అసెంబ్లీకి శనివారం (అక్టోబర్ 5న) పోలింగ్ జరిగింది. ఓటింగ్ అనంతరం హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాల (Haryana Exit Polls Result)ను పలు సర్వే సంస్థలు విడుదల చేశాయి. హర్యానాలో బీజేపీ అధికారం కోల్పోతుందని ఏబీపీ సీ ఓటర్ సహా పలు సర్వే సంస్థల్లో తేలింది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పంజా విప్పింది. దాదాపు 10 ఏళ్ల తరువాత హర్యానాలో కాంగ్రెస్ అధికారం సొంతం చేసుకోనుంది. ఎగ్జిట్ పోల్స్ లో పలు సంస్థలు హర్యానాలో కాంగ్రెస్ దే అధికారమని తేల్చేశాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ దే అధికారమని వచ్చింది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపుతో ఫలితాలు రానున్నాయి.
హర్యానా అసెంబ్లీలో 90 స్థానాలుండగా, కాంగ్రెస్ పార్టీ సొంతంగానే మెజార్టీ సాధించే అవకాశం కనిపిస్తోంది. పార్టీల పరంగా చూస్తే... ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 50 నుంచి 58 సీట్లు రాగా, బీజేపీ 20 నుంచి 28 సీట్లకు పరిమితం కానుంది. ఇతరులు 10 నుంచి 14 స్థానాలు, జేజేపీ గరిష్టంగా 2 సీట్లు నెగ్గే ఛాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఎగ్జిట్ పోల్‌లో దాదాపు అన్ని సంస్థలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ నిలిచింది.
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి..
ధృవ్ రీసెర్చ్- బీజేపీకి 27 సీట్లు, కాంగ్రెస్‌కు 57 సీట్లు, ఇతరులకు 8 సీట్లు వస్తాయి. ఐఎన్ఎల్‌డీ, జేజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు
సీఓటర్ - కాంగ్రెస్ 50-58 సీట్లు, బీజేపీ 20-28, ఇతరులకు 10 నుంచి 14 సీట్లు, జేజేపీకి గరిష్టంగా 2 సీట్లు
దైనిక్ భాస్కర్- కాంగ్రెస్‌కు 44-54 సీట్లు, జేజేపీకి 15-29 సీట్లు, ఐఎన్‌ఎల్‌డీ కూటమికి 1-5 సీట్లు, ఇతరులకు 6-9 సీట్లు వస్తాయని తెలుస్తోంది.
పీపుల్స్ పల్స్ - బీజేపీకి 26 సీట్లు, కాంగ్రెస్‌కు 55 సీట్లు, INLDకి 2 నుంచి 3 సీట్లు, ఇతరులకు 4-6 సీట్లు వస్తాయని తేలింది.
సర్వే సంస్థలు | బీజేపీ | కాంగ్రెస్ | INLD | జేజేపీ | ఇతరులు |
---|---|---|---|---|---|
ధ్రువ్ రీసెర్చ్ | 27 | 57+ | - | 0 | 6 |
సీఓటర్ | 20-28 | 50-58 | - | 0-2 | 10-14 |
మార్ట్రైజ్ | 18-24 | 55-62 | 3-6 | 0-3 | 2-8 |
పీపుల్స్ పల్స్ | 26 (+/-7) | 55 (+/-7) | 2-3 | - | 4-6 |
దైనిక్ భాస్కర్ | 15-29 | 44-54 | 1-5 | 0-1 | 6-9 |
న్యూస్24- చాణక్య | 18-24 | 55-62 | - | - | 2-5 |
టైమ్స్ నౌ | 22-32 | 50-64 | - | - | 2-8 |
JIST-TIF రీసెర్చ్ | 29-37 | 43-53 | 0-2 | 0 | 4-6 |