Daily Horoscope for 27 August 2024 


మేష రాశి


ఈ రాశివారి కుటుంబంలో వివాదాలు తలెత్తవచ్చు. కార్యాలయంలో పనితీరులో మార్పు వస్తుంది. తెలియని వ్యక్తులను ఎక్కువగా నమ్మొద్దు. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారులకు గత పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను అందిస్తాయి. ఆస్తులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.  


వృషభ రాశి


ఈ రాశి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. మిమ్మల్ని ఎక్కువగా బాధపెట్టిన సంఘటనలను మళ్లీ మళ్లీ తలుచుకోవద్దు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు.  


మిథున రాశి


ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చిస్తారు. నూతన కార్యక్రమాలు ఏం ప్రారంభించినా అనుభవజ్ఞుల మార్గదర్శకత్వం తీసుకోవడం మంచిది. స్నేహితులకు అవసరానికి సహాయం అందిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది 


కర్కాటక రాశి


ఈ రాశివారు జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతారు. మీ మాటతీరు ఆకట్టుకునేలా ఉంటుంది. యువత కెరీర్ కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.


Also Read: లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా దక్కాలంటే..తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలా చేయండి!


సింహ రాశి


ఈ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు రావొచ్చు. కష్టపడి పనిచేసినప్పుడే అందుకు తగిన ప్రతిఫలం పొందుతారు.సాంకేతికతకు సంబంధించిన వ్యాపారంలో మంచి లాభాలుంటాయి.  వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. కోపం తగ్గించుకోవాలి. 
 
కన్యా రాశి


ఈ రోజు మీకు అనుకూల పరిస్థితులు ఉండవు. ఆర్థిక లావాదేవీల కోసం అస్సలు అప్పు తీసుకోకండి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత శ్రమించాలి. మీ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఇది. 
 
తులా రాశి


మీ అజాగ్రత్త కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఒత్తిడి వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదు. ఇంట్లో కొంత ఇబ్బంది వాతావరణం ఉంటుంది. కార్యాలయంలో పనితీరులో మార్పు వస్తుంది.


వృశ్చిక రాశి 


మనసులో కొత్త ఆలోచనలు తలెత్తుతాయి. నూతన శక్తితో ముందుకు సాగుతారు. చిల్లర వ్యాపారుల ఆదాయం పెరగవచ్చు. కళారంగానికి సంబంధించిన వ్యక్తులకు తగిన గౌరవం లభిస్తుంది. 


Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?


ధనస్సు రాశి


ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. శత్రువులు వారి ప్రణాళికలలో విఫలమవుతారు. మీరు మీ ఆలోచనలను స్నేహితులతో పంచుకుంటారు. ఇంటికి సంబంధించిన అలంకరణలో బిజీగా ఉంటారు. విశ్వసనీయ వ్యక్తుల నుండి సలహాలు ఈరోజు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.


మకర రాశి 


ఈ రోజంతా మీకు గందరగోళంగా ఉంటుంది. పిల్లల ప్రవర్తన వింతగా అనిపిస్తుంది. ప్రభుత్వోద్యోగులకు పని ప్రదేశాలలో సమస్యలు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఆరంభంలోనే పరిష్కరించుకోవడం మంచిది. మానసిక ఒత్తిడికి గురవుతారు. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. 
 
కుంభ రాశి


ప్రతికూల ఆలోచనలు మీ ఆరోగ్యంపై  ప్రభావం చూపిస్తాయి. మీ వ్యక్తిగత సంబంధాలలో అనవసర చర్చలకు అవకాశం ఇవ్వొద్దు. అనుకోని ఖర్చులు మీ ఆదాయంపై ప్రభావంచూపిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చేయాల్సిన పనిపట్ల నిబద్ధతగా వ్యవహరించండి. 


Also Read: తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి! 


మీన రాశి


మితిమీరిన ఆలోచనలు మీపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. మనసులో ఉన్న ఆలోచనలు పంచుకునేందుకు ప్రయత్నించడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. రచనా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఆలోచనలు కొత్తగా ఉంటాయి. పని ఒత్తిడి తగ్గించుకోవాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.  


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.