Shabarimale Swamy Ayyappa Temple Opening Dates 2024: జూలై 16 కర్కాటక సంక్రమణం. ఈ సందర్భంగా శబరిమల అయ్యప్పస్వామి ఆలయం జూలై 15 సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరిచారు. జూలై 16 బుధవారం కర్కాటక సంక్రాంతి కావడంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూలై 20 వరకూ 5 రోజుల పాటూ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి ఆగష్టు 16 నుంచి 21 వరకూ ఆలయాన్ని తెరిచి మాసపూజ నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ప్రత్యేక పూజలకు శబరిమల ఆలయం వర్చువల్ క్యూ పాస్‌లను కలిగి ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించనుంది.


Also Read: దక్షిణాయణం - ఉత్తరాయణం మధ్య వ్యత్యాసం ఏంటి , ఏది పుణ్యకాలం!


శబరిమల అయ్యప్పస్వామికి ప్రతి నెలా మాసపూజ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నెలలో నాలుగైదు రోజులు ఆలయాన్ని తెరుస్తారు. ఈ మేరకు జూలై 16న కర్కాటక మాస పూజల సందర్భంగా ముందు రోజు సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరిచి శ్రీకోవిల్‌ను తంత్రి కందరారు మహేశ్‌ మోహనరావు సమక్షంలో మేల్‌శాంతి మహేశ్‌ నంపూతిరి నిర్వహించారు. ఈ 5 రోజుల్లో ఆలయంలో కలషాభిషేకం, లక్షార్చన సహా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో ఉదయాస్తమాన పూజ, అష్టాభిషేకం, పుష్పాభిషేకం, పడిపూజ నిర్వహించనున్నారు. మంగళవారం తెల్లవారుఝామునే కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో తంత్రి మేల్శాంతి సమక్షంలో బ్రహ్మకలశ పూజలు నిర్వహించారు. ఐదురోజుల ప్రత్యేక పూజల అనంతరం తిరిగి శనివారం ఆలయాన్ని మూసివేస్తారు. 


Also Read: తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి - ఈ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి!
 
ఈ ఏడాది చివరి వరకూ శబరిమల ఆలయం తెరిచి ఉండే తేదీలివే...


జూలై 15 - 20 : మాస పూజ , కర్కిడకం - కర్కాటకం పూజ
ఆగస్టు  16 - 21 : మాస పూజ , చింగం - సింహం పూజ
సెప్టెంబర్ 13 -17 : తిరువోణం
సెప్టెంబర్ 16-21  : మాసపూజ , కన్ని - కన్యా పూజ
అక్టోబర్  16 - 21 : మాస పూజ , తులం - తులా 
నవంబర్  15 నుంచి డిసెంబరు 26 : మండల పూజా  మహోత్సవం 
2024 డిసెంబరు 30 నుంచి  2025 జనవరి 20 వరకు మకరవిళక్కు  


కర్కిడకం మాసపూజ సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకునేందకు వచ్చే భక్తుల కోసం KSRTC 12/07/2024 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునేందుకు సంప్రదించాల్సిన నంబర్లు ఇవే..
 
పంబ ఫోన్:0473-5203445
చెంగనూర్ ఫోన్:0479-2452352
పతనంతిట్ట ఫోన్: 0468-2222366


KSRTC, కంట్రోల్ రూమ్ 
సెల్ నంబర్ – 9447071021
ఫోన్ - 0471-2463799


Also Read: అన్నవరం ఆలయం కింద అంతస్తులో ఏముంది - ఈ క్షేత్రం గురించి మీకు తెలియని విషయాలివే!


Sri Ayyappa Pancharatnam -  అయ్యప్ప  పంచరత్నం  


లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ |
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ ||  


విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ |
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ ||  


మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితమ్ |
సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ ||  


అస్మత్కులేశ్వరం దేవమస్మచ్ఛత్రువినాశనమ్ |
అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహమ్ ||  


పాండ్యేశవంశతిలకం కేరళే కేళివిగ్రహమ్ |
ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ ||  


పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః |
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే ||  


ఇతి శ్రీ శాస్తా పంచరత్నమ్ |