10 Famous Places of Mahabharata Period: భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు మహాభారతంతో ముడిపడి ఉన్నాయి.వాటిలో కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ అంతే ప్రాధాన్యతతో కొనసాగుతున్నాయి..అవేంటో చూద్దాం...


1.హస్తినాపురం
 మహాభారతానికి సంబంధించిన 10 ప్రధాన ప్రదేశాలలో మొదటిది, కురు వంశ రాజుల రాజధాని అయిన హస్తినాపురం. ఈ ప్రదేశం మీరట్ నగరానికి సమీపంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీకి ఈశాన్యంగా 90 కిలోమీటర్ల దూరంలో గంగానది ఒడ్డున ఈ నగరం ఉంది. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం హీరో దుష్యంతుడు ఇక్కడ పాలకుడు.


2. తక్షశిల
గాంధార ప్రాంతానికి రాజధానిగా ఉండేది తక్షశిల. కౌరవుల తల్లి అయిన గాంధారి.. గాంధార రాజు శుభాళ్ కుమార్తె. ఈ ప్రదేశంలో, పాండవుల వారసుడు జనమేజయుడు తన తండ్రి పరీక్షితుజు పాము కాటు కారణంగా మరణించిన తరువాత కోపంతో  సర్పయాగం నిర్వహించాడని చెబుతారు. ఈ యాగంలో వేలాది పాములు బూడిదయ్యాయి. తక్షశిల ప్రపంచంలోని మొదటి విశ్వవిద్యాలయం. ఆచార్య చాణక్యుడు సహా పలువులు మేధావులు విద్యను అభ్యసించింది ఇక్కడే.


Also Read: మహాభారతం ప్రకారం విజయం, సంతోషం కోసం నిత్యం ఈ నాలుగు పాటించాలి


3.ఉజ్జయిని
మహాభారత కాలానికి సంబంధించిన ఉజ్జయిని ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని ఉధం సింగ్ నగర్ జిల్లా కాశీపూర్ లో ఉంది. ఉజ్జయినిలోనే ద్రోణాచార్యుడు..కౌరవ, పాండవులకు బోధించాడంటారు. పాండవులు గురు దక్షిణ రూపంలో ఈ సరస్సును నిర్మించారని నమ్ముతారు.


4. లక్క గృహం
మహాభారత కాలంలో దుర్యోధనుడు నిర్మించిన లక్క గృహం..ప్రస్తుతం బాగ్ పత్ లో ఉంది. 'వర్ణావత్' అనే ఈ ప్రదేశం కౌరవుల నుంచి పాండవులు డిమాండ్ చేసిన గ్రామాల్లో ఒకటి. కానీ దుర్యోధనుడు సూది కొనకు సమానమైన భూమిని ఇవ్వనని చెప్పాడు. ఆ తర్వాత ఓకుట్రతో లక్క గృహాన్ని నిర్మించాడు. ఆ ఇంట్లోపాండవులు నివాసం ఉన్నప్పుడు వారిని రహస్యంగా తగలబెట్టి నాశనం చేయాలని కుట్రపన్నినా అది విజయవంతం కాలేదు. 


5. పాంచాల
మహాభారతంలో ప్రస్తావించిన పాంచాల 16 పౌరాణిక మహాజనపదాలలో ఒకటి. పురాతన కాలంలో ఇది హిమాలయాలు, చంబా నది మధ్య ఉంది. ప్రస్తుతం ఇది పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని బరేలీ, బదౌన్ , ఫరూఖాబాద్ జిల్లాలకు ఆనుకుని ఉంది. మహాభారత కథ ప్రకారం పాంచాల రాజు ద్రుపదుడి కుమార్తె ద్రౌపదిని పాండవులను వివాహం చేసుకున్నారు.


Also Read: మహాభారతం - స్నేహం 3 రకాలు, ఇందులో మీ ఫ్రెండ్స్ ఏ టైప్!


6.ఇంద్ర ప్రస్థం
మహాభారతంలో పేర్కొన్న ఇంద్రప్రస్థం అంటే ప్రస్తుతం భారతదేశ రాజధాని ఢిల్లీ. పాండవులకు సంబంధించిన ఈ ప్రదేశం యమునా నది ఒడ్డున ఉంది. మహాభారత కథ ప్రకారం, ధృతరాష్ట్రుడి నుంచి సగం రాజ్యాన్ని స్వీకరించిన తర్వాత పాండవులు తమ రాజధానిని ఇంద్రప్రస్థంలో నిర్మించారు. కౌరవుల రాజధాని దాని నుంచి 45 మైళ్ళ దూరంలో ఉన్న హస్తినాపురంలో ఉంది. 


7.అంగ్ ప్రదేశ్
మహాభారత కాలానికి చెందిన అంగ్ ప్రదేశ్..ప్రస్తుత బీహార్ రాష్ట్రం భాగల్పూర్, ముంగేర్ జిల్లాల ఉమ్మడి ప్రాంతంగా పరిగణిస్తున్నారు. మహాభారత కాలంలో కుంతి కుమారుడు కర్ణుడు అంగరాజ్యానికి రాజు. పాండవులు-కౌరవుల విలువిద్య ప్రదర్శన జరుగుతున్నప్పుడు కర్ణుడు అక్కడకు వచ్చి తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. సూతపుత్రుడివి అని పాండవులు అవమానించడంతో దుర్యోదనుడు అండగా నిలిచి...అప్పటికప్పుడు అంగరాజ్యానికి కర్ణుడిని రాజుగా చేస్తాడు. 


8.మధుర
మహాభారత కాలంలో ప్రస్తావించిన మధుర నగరం ఇప్పటికీ అదే పేరుతో ఉత్తర ప్రదేశ్ లో ఉంది. శ్రీకృష్ణుడు జన్మించింది ఇక్కడే. మేనమామ కంసుడి కోటలో శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి ఇప్పటికీ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.


9.మహాభారత కాలంలో భీముడు హనుమంతుడిని కలుసుకున్న ప్రదేశం ఉత్తరాఖండ్ లోని జోషిమండ్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పవిత్ర ప్రదేశంలోనే హనుమంతుడు ఒకసారి మహాభారత యుద్ధంలో విజయం సాధించాలని భీముడిని ఆశీర్వదించాడని చెబుతారు.


10.కురుక్షేత్ర
కురుక్షేత్ర.. మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశం. ఇక్కడే శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. మహాభారత యుద్ధానికి సాక్ష్యం ఈ ప్రదేశం. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో ప్రధాన జిల్లాగా ఉంది. హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రం కురుక్షేత్ర చుట్టూ అంబాలా, యమునా నగర్, కర్నాల్,కైతాల్ ఉన్నాయి.