Mahabharat: నిత్య జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి.. నిత్యం పాటించాల్సిన ముఖ్యమైన విషయాలేంటని ధర్మరాజు శ్రీ కృష్ణుడిని అడుగుతాడు. వాటిని ఆచరించడం ద్వారా ఓదార్పు కలగాలి, ప్రశాంతత పొందాలి, విజయం సిద్ధించాలని కోరుతాడు. అప్పుడు స్పందించిన కృష్ణుడు..దినచర్యలో ఈ నాలుగు అంశాలు చేర్చుకుంటే చాలు అనుకున్నవి నెరవేరుతాయి, మనశ్సాంతి లభిస్తుంది, నిత్యం సంతోషంగా ఉండొచ్చు, సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతాడు...అవేంటంటే..


దానం
హిందూ మతంలో దానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ జన్మలో చేసిన దాన ధర్మాలే మరుజన్మ లేకుండా చేస్తాయని, ఉత్తమ గతులు కలిగేలా చేస్తాయని అంటారు. అందుకే దానం అనేది నిత్యకృత్యం అవ్వాలని చెప్పాడు శ్రీ కృష్ణుడు. అందుకే నిత్యం దానాలు చేసేవారిని 'చేతికి ఎముక లేదని', అస్సలు దానం పేరే ఎత్తని వారిని 'ఎంగిలి చేత్తో కాకిని కొట్టరని' పెద్దలు అంటుంటారు. పూర్వీకుల నుంచి నేర్చుకోవాల్సినది, అనుసరించాల్సింది దానగుణమే. అయితే చేసే దానం అపాత్ర దానం కాకూడదు..అవసరం అయిన వారికి మాత్రమే దానం చేయాలి కానీ దుర్వినియోగం చేసేవారికి కాదని తెలుసుకోవాలి. ఈ గుణం ద్వారా సకల పాపాలు నశించి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 


Also Read: మహాభారతం - స్నేహం 3 రకాలు, ఇందులో మీ ఫ్రెండ్స్ ఏ టైప్!


మనస్సును నియంత్రించడం
ఒక వ్యక్తి ఎదుగుదలకు,పతనానికి ముఖ్య కారణం మనసు కూడా. ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విచక్షణ కలిగిఉండాలి. చంచలమైన మనసుని నియంత్రించగలగాలి. దృష్టి ఎప్పుడూ లక్ష్యం మీద ఉండాలి. అడ్డదారిలో ఆలోచించకుండా సరైన మార్గంలో వెళ్లేలా ఉండాలంటే ముందు మనసుని నియంత్రించాలి. మనసుని నియంత్రించలేని వ్యక్తి కోరికలు నెరవేర్చుకునేందుకుతప్పుడు మార్గంలో వెళతాడు. 


ఎప్పుడూ నిజమే చెప్పాలి
సత్య మార్గంలో నడిచే వ్యక్తికి ఆ మార్గంలో చాలా సమస్యలు ఉంటాయి..కానీ..కచ్చితంగా ఏదో ఒక రోజు విజయం పొందుతాడు. ఆ విజయం కూడా శాశ్వతమైనది అవుతుంది. అందుకే సత్యమార్గం కష్టమైనప్పటికీఅదే మార్గాన్ని ఎంచుకోవాలి. అవినీతి, అబద్ధాల మెట్లపై నిర్మించిన కోటలు  తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినా ఏదో ఒకరోజు కూలిపోకతప్పదు.  అందుకే  నిజమే మాట్లాడాలి


Also Read: మహాభారత యుద్ధంలో ఏరోజు ఎంతమంది చనిపోతారో ముందు రోజు రాత్రే క్లారిటీ ఇచ్చేసిన కృష్ణుడు


తపస్సు 
తపస్సు అంటే లక్ష్యంపై శ్రద్ధ, ఏకాగ్రత అని చెప్పుకోవచ్చు. లక్ష్యంపై పూర్తిస్థాయి దృష్టి పెట్టలేనప్పుడు ఎవ్వరూ ఏ విషయంలోనూ విజయం సాధించలేరు. చేసిన తప్పుు తెలుసుకోవాలి, భగవంతుడికి క్షమాపణలు చెప్పుకోవాలి, మరోసారి ఆ తప్పులు చేయకుండా ఉండాలి...అదే సమయంలో లక్ష్యంపైనే దృష్టి సారించాలి. అప్పుడే అన్నింటా విజయం సొంతం చేసుకోగలుగుతారు.


నిత్యం ఈ నాలుగు విషయాలు పాటించిన వారి జీవితంలో సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించుకోవడం పెద్దకష్టం అవదు. ఇంటా-బయటా గౌరవం పొందుతారు. తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారనేది ధర్మరాజుకి కృష్ణుడు చెప్పిన మాటల వెనుకున్న ఆంతర్యం....


2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023  కర్కాటక  రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి