లెక్క పెట్టి వంట చేసినా ఎక్కువవడమో, తక్కువ అవడమో ఉంటుంది. అలాంటిది కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్న వారికి నిత్యం ఎంత ఫుడ్ అవసరమో ఎలా తెలుస్తుంది. యుద్ధంలో చనిపోయిన వారు మినహా భోజనానికి ఎంతమంది వస్తారో కుక్ కి ఎలా తెలిసింది. ఎవరా వంటవాడు...


దక్షిణ భారతంలోని ఉడిపి రాజైన ఉడిపిరాజైన నరేషుడు తన సైన్యాన్ని తీసుకుని కురుక్షేత్ర సంగ్రామం దగ్గరకు  వెళ్లినప్పుడు తమ వైపు రావాలి అంటే తమవైపు రావాలని  కౌరవులు, పాండవులు కోరతారు. తెలివిగా వ్యవహరించిన ఉడిపిరాజు ఎటూ వెళ్లకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు.అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య.. అందుకే ఇందులో పాల్గొనడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను-నా సైన్యం యుద్ధంలో పాల్గోకుండా సైనికులకు వండిపెడతాం అని చెబుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతంగా ఉందని సరే అంటాడు.


Also Read:  పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 


వాస్తవానికి 50 లక్షల మందికి వండిపెట్టాలంటే భీముడు, సైన్యం వల్ల మాత్రమే అవుతుంది. కానీ ఈ సమయంలో భీముడికి కురుక్షేత్రంలో పాల్గొనకతప్పదు.అందుకే నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వండిపెట్టగల సమర్థుడివి అని చెబుతాడు కృష్ణుడు. నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడున్న సైనికులకు నిత్యం వంట చేసి పెడతాడు. ఎలా ఉంటే.. సాయంత్రానికి తాను వండిన భోజనంలో ఒక్క మెతుకు కూడా మిగలకుండా...అంటే వృధా కాకుండా అన్నమాట. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం తగ్గుతోంది కానీ నరేషుడు వండిన వంట ఒక్కరోజు కూడా వృధాకాలేదు, సరిపోలేదు అనిపించలేదు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు.


ఇది ఎలా సాధ్యమైంది
అంతమంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు, అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు, ఈ రోజు యుద్ధంలో ఇంతమంది చనిపోతారని నరేషుడికి ఎలా తెలుస్తోందని ఆశ్చర్యపోయేవారు. 


నరేషుడిని ప్రశ్నించిన ధర్మరాజు
ఇలా 18 రోజులు గడిచిపోయాయి.పాండవులు గెలిచారు.పట్టాభిషేకం జరుగుతోంది. అప్పటి వరకూ ఆగిన ధర్మరాజు అప్పుడు ఉడిపిరాజు, వంటచేసి పెట్టిన నరేషుడిని అడిగాడు...'మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు.కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యానికి వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా, వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు.ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అడుగుతాడు.


నరేషుడు ఇచ్చిన సమాధానం
మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం. ఈ గొప్పతనమంతా కృష్ణుని కే చెందుతుంది అంటాడు.''యుద్ధం జరిగినన్ని రోజులూ శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.నేను వాటిని లెక్క పెట్టి పెట్టే వాడిని. శ్రీకృష్ణుడు ఎన్ని పెసరకాయలు తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.అంటే కృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు.దీనిని బట్టి మిగిలిన వారిని భోజనం వండేవాడిని" అని చెప్పాడు. 


ఇది మహాభారతంలో అరుదైన కథ.కర్ణాటకలోని ఉడిపి జిల్లా కృష్ణ మందిరంలో శ్రీకృష్ణుడి లీలల గురించి ఈ కథ ఇప్పటికీ చెబుతుంటారట. 


Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....