2023 Gemini  Yearly Horoscope:  2023లో మిథునరాశివారికి ఎక్కువగా అనుకూల ఫలితాలే ఉన్నాయి. శని అష్టమ స్థానంలో ఉన్న మొదటి 40 రోజులు పూర్తైతే ఇక మీకు తిరుగులేదు..ఆదాయం, ఆరోగ్యం, ఆనందం..అన్నీ మీ సొంతం...ఈ రాశివారికి ఏడాదంతా ఎలా ఉందో చూద్దాం

మిథున రాశి వార్షిక ఫలితాలు 20232022 మొత్తం అష్టమంలో ( మీ రాశి నుంచి 8వ స్థానంలో) ఉన్న శని 2023 ఫిబ్రవరి 9కి స్థానం మారుతాడు. అయితే 2023 జనవరి నుంచీ కొంత రిలీఫ్ ఉంటుంది. అష్టమంలో ఉన్న శని స్థానం మారడం వల్ల ఇన్నాళ్లుగా వెంటాడిన సమస్యలు తీరిపోయి అదృష్టం కలిసొస్తుంది. సంవత్సరం ప్రారంభంలో 10వ స్థానంలో ఉన్న దేవగురువు బృహస్పతి  ఏప్రిల్ 22నుంచి పదకొండో స్థానంలోకి అడుగుపెడుతుంది.  రాహువు అక్టోబర్ 30న  11 స్థానం నుంచి పదో స్థానానికి ..కేతువు ఐదో స్థానం నుంచి ఆరో ఇంటికి చేరుతారు..ఈ నాలుగు గ్రహాల సంచారం మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తుంది.

Also Read: గ్రహస్థితి బాగోపోవడం అంటే ఏంటి, ఏ గ్రహం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది!

  • ఏడాది ఆరంభంలోనే శని ప్రభావం తగ్గడంతో మీరున్న రంగంలో అడుగులు వడివడిగా పడతాయి.
  • 2022 లో రకరకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడిన వారు 2023లో ఉపశమనం పొందుతారు
  • మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి కానీ మీ తెలివితేటలతో ఎలాంటి సమస్యా లేకుండా బయటపడతారు
  • కొత్త ఏడాదిలో మొదటి 40 రోజులు మాత్రమే ఇబ్బందికర పరిస్థితులుంటాయి..ఆ తర్వాత అంతా మంచే జరుగుతుంది
  • ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి..మానసిక ఒత్తిడి తగ్గతుంది...నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది .. మీ చుట్టూ ఉన్న అన్ని పరిస్థితులలో మార్పులు ఉంటాయి
  • ఈ సమయంలో మీరు విదేశీ పర్యటనలతో పాటూ దూర ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి
  • ఆధ్యాత్మిక వ్యవహారాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు
  • ఉద్యోగం మారాలి అనుకుంటే లాభదాయకంగా ఉంటుంది..మీకు సంతోషాన్నిస్తుంది..ఉద్యోగం మారడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు
  • నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగంలో స్థిరపడతారు
  • ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు
  • సంవత్సరం ప్రారంభ నెలల్లో పిల్లలకు సంబంధించిన ఒత్తిడులు ఉంటాయి, ప్రేమ జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కానీ ఈ సమయం మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది
  • మొదటి నాలుగు నెలలు కన్నా తర్వాత 8 నెలలు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది
  • 2023 మీ జీవితంలో మంచి సమయం అని చెప్పుకోవచ్చు
  • బృహస్పతి అనుగ్రహం వల్ల కుటుంబ జీవితం సామరస్యం, శాంతితో నిండి ఉంటుంది, శుభకార్యాలు జరుగుతాయి

Also Read: 'అంతా మా కర్మ', 'ప్రారబ్ధం' అంటారు కదా, ఎందుకలా అంటారు - కర్మ అంటే ఏంటి!

2023 మిథున రాశి నెలవారీ ఫలితాలుసంవత్సరం ప్రారంభంలో శని 8వ ఇంట్లోనూ, బృహస్పతి 10వ ఇంట్లోనూ ఉంటాడు. ఈ కారణంగా ప్రారంభ నెలలో కెరీర్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయి, కుటుంబ జీవితంలో ఒత్తిడి ఉంటుందిఫిబ్రవరిలో మీరు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది , కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుందిమార్చిలో మీ ప్రవర్తనలో కఠినత్వాన్ని నివారించాలి, సూటిగా ఉండకుండా ఉండటం మీకు మంచిదిఏప్రిల్‌ లో బృహస్పతి 11వ ఇంట్లో అడుగుపెట్టడంతో మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది, కెరీర్లో విజయం సాధిస్తారుమేలో కుటుంబ కలహాలు పెరిగే అవకాశం ఉంది, భూమి మరియు ఆస్తికి సంబంధించిన విషయాలలో ఇబ్బందులు ఎదురవుతాయిజూన్ నెల మీకు అనుకూల ఫలితాలనిస్తుంది...పనిలో విజయం సాధిస్తారు..మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.జూలై నెల  మీ ఆర్థిక స్థితిని పెంచుతుందిఆగస్టులో మీరు మీ ప్రత్యర్థుల కంటే బలంగా ఉంటారు , ఖర్చులు పెరుగుతాయిసెప్టెంబరులో శుభవార్త వింటారు..మీ రంగాల్లో దూసుకెళతారుఅక్టోబర్ నెలలో మీరు స్థిరాస్తి లేదా కారు కొనుగోలు చేస్తారునవంబర్ నెల కూడా మీకు అనుకూల ఫలితాలను ఇస్తుందిడిసెంబరులో ఆస్తి -  భూమికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు, మీ తల్లి ఆరోగ్యం దెబ్బతిట్టుంది

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి