ఓ వ్యక్తి జాతకాన్ని నిర్ణయించేది, నిర్ధేశించేది నవగ్రహాలే. ఈ గ్రహాల స్థానాన్ని బట్టే అనుకూల, ప్రతికూల ఫలితాలుంటాయి..మరి ఏ గ్రహం వల్ల ఎలాంటి ప్రతికూల ఫలితాలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. ఆ గ్రహాలకు తగిన దానాలు, శాంతులు చేయడం, నిత్యం నవగ్రహ శ్లోకం చదువుకోడం వల్ల కానీ కొంత ఉపశమనం లభించవచ్చు.
రవి( సూర్యుడు)కంటికి సంబంధించిన వ్యాధులు, హృదయానికి సంబంధించిన రోగాలు, ఎముకల నొప్పులు, పార్శ్య నొప్పి, మనో వ్యసనం, అతిసారం, శిరోబాధలు ఉంటాయి. ముఖ్యంగా సూర్యుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఇవన్నీ తప్పవు.
చంద్రుడుచంద్రుడు మీ రాశి నుంచి 8,12 స్థానాల్లో ఉన్నప్పుడు...కంఠానికి,పొట్టకి సంబంధించిన వ్యాధులు బాధిస్తాయి. క్షయ, పాండురోగం, మనస్థిమితం లేకపోవడం, మనోధైర్యం కోల్పోవడం జరుగుతుంది.
కుజుడుఅష్టమంలో కుజుడు ఉన్నప్పుడు..అంటే 8 వ స్థానంలో ఉన్నప్పుడు మూత్ర కోశం ఇబ్బందులు, చెవి పోటు, ఒంటిపై పొక్కులు, కుష్టు సంబంధిత వ్యాధులు, వాహన ప్రమాదాలు,ఎముకలు విరగడం, సోదరులతో వివాదాలు ఉంటాయి.
Also Read: 'అంతా మా కర్మ', 'ప్రారబ్ధం' అంటారు కదా, ఎందుకలా అంటారు - కర్మ అంటే ఏంటి!
బుధుడుబుధుడు 8,12 స్థానాల్లో ఉన్నప్పుడు నాలుకకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. చర్మ సమస్యలు కూడా వేధిస్తాయి.పైల్స్, పొట్టకు సంబంధించిన వ్యాధులు వెంటాడతాయి. పాండు రోగం, కుష్టురోగం వచ్చే ప్రమాదం ఉంది
గురుడుగురుడు అష్టమంలో ఉంటే మెదడు, ఊపిరితిత్తులుకు సంబంధించిన రోగాలు వస్తాయి. ఆలోచనా విధానం సరిగ్గా ఉండదు..పేగులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి.
శుక్రుడుశుక్రుడు 8,12 స్థానాల్లో ఉంటే మూత్ర రోగం, మధుమేహం,పైత్య రోగం, సుఖ రోగాలు, రక్తదోషం, వ్యసనం, ఇంద్రియరోగాలతో బాధపడతారు
Also Read: కలలో డబ్బు-బంగారం కనిపిస్తే ఏమవుతుంది, శుభమా-అశుభమా!
శని ఏలినాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని..శని మూడు రకాలుగా ఇబ్బంది పెడుతుంది. శని వెంటాడుతున్న సమయంలో కాలేయ సంబంధిత రోగాలు, మనో వ్యధ, నరాల బలహీనత ఉంటుంది.
రాహువురాహు సంచారం అనుకూలంగా లేకపోతే... మతిభ్రమణం, పిశాచ బాధలు, సర్ప భయం, చర్మ సంబంధ రోగాలు , రక్తంలో నీరు చేరడం, ఉబ్బసం వెంటాడతాయి.
కేతువుకేతువు 8, 12 స్థానంలో సంచరిస్తున్నప్పుడు శారీరకబాధలు, నీరసం, నిస్సత్తువ, చర్మ వ్యాధులు ఇబ్బంది పెడతాయి.
నవగ్రహ శ్లోకంశ్లోకంఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచగురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
సూర్యుడుజపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||
చంద్రుడు దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||
కుుజుడుధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||
బుధుడు ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధంసౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||
గురుడుదేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభంబుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||
శుక్రుడుహిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుంసర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||
శనినీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజంఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||
రాహువుఅర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనంసింహికాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహం ||
కేతువుఫలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకంరౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||