Kashmir Remark in UN: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ లేవనెత్తడంతో భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. 'అంతర్జాతీయ శాంతి, భద్రత, సంస్కరించిన బహుపాక్షికత కోసం కొత్త ధోరణి' అనే అంశంపై గురువారం జరిగిన బహిరంగ చర్చకు భారత్ నాయకత్వం వహించింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్.. పాకిస్థాన్‌కు కౌంటర్ ఇచ్చారు.
అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌కు ఆతిథ్యమిచ్చిన దేశానికి, పొరుగున ఉన్న పార్లమెంటుపై దాడి చేసిన దేశానికి.. ఇప్పుడు ఐరాస సమావేశంలో నీతులు వల్లించే అర్హత లేదు. - ఎస్ జై శంకర్, భారత విదేశాంగ మంత్రి
ప్రస్తుతం మహమ్మారి వ్యాప్తి, వాతావరణ మార్పు, సంఘర్షణలు లేదా ఉగ్రవాదం వంటి కీలక సవాళ్లకు ప్రభావవంతమైన ప్రతిస్పందనపై ఐరాస విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని జై శంకర్ అన్నారు.
బహుపాక్షికతను సంస్కరించే ఆవశ్యకతపై మనం ఈ రోజు స్పష్టంగా దృష్టి సారిస్తున్నాం. మేము సహజంగానే మా ప్రత్యేక అభిప్రాయాలను కలిగి ఉన్నాం. అయితే ఇది ఇంకా ఆలస్యం కాకూడదనే అభిప్రాయం పెరుగుతోంది. మనం ఉత్తమ పరిష్కారాల కోసం శోధిస్తున్నప్పుడు ఇలాంటి బెదిరింపులను అంగీకరించకూడదు. ప్రపంచం ఆమోదయోగ్యం కానిదిగా భావించే వాటిని సమర్థించే ప్రశ్న కూడా ఉత్పన్నం కాకూడదు. ఇది సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఒసామా బిన్ లాడెన్‌కు ఆతిథ్యం, పొరుగున ఉన్న పార్లమెంట్‌పై దాడి చేసిన దేశానికి నీతులు చెప్పే అర్హత లేదు. ఇది సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశానికి కచ్చితంగా వర్తిస్తుంది. - ఎస్ జై శంకర్, భారత విదేశాంగ మంత్రి
చైనాపై
ఈ అంశంపై భద్రతా మండలిలో బుధవారం మాట్లాడిన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనికి జై శంకర్ దీటుగా బదులిచ్చారు. చైనా, పాకిస్థాన్‌లపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు.
ఉగ్రవాదానికి పాల్పడిన వారిని సమర్థించేందుకు.. వారికి సహాయం చేసేందుకు బహుముఖ వేదికలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఆయుధంగా చేసుకున్న దేశాలకు వత్తాసు పలుకుతున్నారు. - ఎస్ జై శంకర్, భారత విదేశాంగ మంత్రి
Also Read: India China Clash: చైనా సైన్యాన్ని తరిమికొట్టిన భారత జవాన్లు- ఇదిగో వీడియో!