మంధనాచల ధారణ హేతో, దేవాసుర పరిపాలవిభో
కూర్మాకార శరీర నమో, భక్తం తే పరిపాలయమామ్
కృతయుగంలో దేవ, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు పెట్టారు. మందరగిరిని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగింది. ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలంతా శ్రీ మహావిష్ణువు వేడుకున్నారు. అప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. ఈ అవతారంలో స్వామివారు కొలువైన ఏకైక క్షేత్రం శ్రీకూర్మం. శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో వంశధారా నది ఒడ్డున ఉంది ఈ ఆలయం.
స్థలపురాణం
కృతయుగంలో శ్వేతరాజు, అతని భార్య వంశధారల తపస్సుకు మెచ్చిన కూర్మనాథుడు వారి కోరిక ప్రకారం ఇక్కడ వెలిశారని కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాలలో వుంది. శ్రీ రాముడు, బలరాముడు, జమదగ్ని సహా ఎందరో పురాణపురుషులు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఏ దేవాలయంలోనూ లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఆలయంలో ఉంటాయి. ఈ రెండు స్తంభాలు శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. కృతయుగం నాటి ఈ దేవాలయంలో మూలవిరాట్టుని బ్రహ్మ ప్రతిష్టించాడని చెబుతారు. ప్రతిరోజు రాత్రివేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేని విధంగా ఉంటాయని కథనం.
శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం నుంచి పుష్కరిణి ఉద్భవించిందని అందుకే ఈ గుండంలో స్నానమాచరిస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెబుతారు. అస్తికలు కూడా ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు. గుండంలో స్నానం చేసి ఇక్కడ వున్న విష్ణుపాదాల దగ్గర పిండప్రదానం చేస్తే పితృదేవతలకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం. శ్రీ కూర్మ జయంతితో పాటూ ఏటా హోళీ పౌర్ణమి రోజు ఆలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి.
శ్రీ కూర్మ స్తోత్రం
నమామి తే దేవ పదారవిందం
ప్రపన్న తాపోప శమాతపత్రం
యన్మూలకేతా యతయోఽ౦జసోరు
సంసారదుఃఖం బహిరుత్క్షిపంతి
ధాతర్యదస్మిన్భవ ఈశ జీవా
స్తాపత్రయేణోపహతా న శర్మ
ఆత్మన్లభంతే భగవంస్తవాంఘ్రి
చ్ఛాయాం స విద్యామత ఆశ్రయేమ
మార్గంతి యత్తే ముఖపద్మనీడై
శ్ఛన్దస్సుపర్ణైరృషయో వివిక్తే
యస్యాఘమర్షోదసరిద్వరాయాః
పదం పదం తీర్థపదః ప్రపన్నాః
యచ్ఛ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా
సంమృజ్యమానే హృదయేఽవధాయ
జ్ఞానేన వైరాగ్యబలేన ధీరా
వ్రజేమ తత్తేఽ౦ఘ్రి సరోజపీఠమ్
విశ్వస్య జన్మస్థితిసంయమార్థే
కృతావతారస్య పదాంబుజం తే
వ్రజేమ సర్వే శరణం యదీశ
స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్
యత్సానుబంధేఽసతి దేహగేహే
మమాహమిత్యూఢ దురాగ్రహాణాం
పుంసాం సుదూరం వసతోపి పుర్యాం
భజేమ తత్తే భగవన్పదాబ్జమ్
తాన్వా అసద్వృత్తిభిరక్షిభిర్యే
పరాహృతాంతర్మనసః పరేశ
అథో న పశ్యన్త్యురుగాయ నూనం
యేతే పదన్యాస విలాసలక్ష్మ్యాః
పానేన తే దేవ కథాసుధాయాః
ప్రవృద్ధభక్త్యా విశదాశయా యే
వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం
యథాఞ్జసాన్వీయురకుంఠధిష్ణ్యమ్
తథాపరే చాత్మసమాధియోగ-
బలేన జిత్వా ప్రకృతిం బలిష్ఠాం
త్వామేవ ధీరాః పురుషం విశన్తి
తేషాం శ్రమః స్యాన్న తు సేవయా తే
తత్తే వయం లోకసిసృక్షయాద్య
త్వయానుసృష్టాస్త్రిభిరాత్మభిః స్మ
సర్వే వియుక్తాః స్వవిహారతంత్రం
న శక్నుమస్తత్ప్రతిహర్తవే తే
యావద్బలిం తేఽజ హరామ కాలే
యథా వయం చాన్నమదామ యత్ర
యథో భయేషాం త ఇమే హి లోకా
బలిం హరన్తోఽన్న మదన్త్యనూహాః
త్వం నః సురాణామసి సాన్వయానాం
కూటస్థ ఆద్యః పురుషః పురాణః
త్వం దేవశక్త్యాం గుణకర్మయోనౌ
రేతస్త్వజాయాం కవిమాదధేఽజః
తతో వయం సత్ప్రముఖా యదర్థే
బభూవిమాత్మన్కరవామ కిం తే
త్వం నః స్వచక్షుః పరిదేహి శక్త్యా
దేవ క్రియార్థే యదను గ్రహాణామ్
ఇతి శ్రీమద్భాగవతే కూర్మస్తోత్తం
Also Read: వైశాఖపూర్ణిమ, బుద్ధ పూర్ణిమ-ఇలా చేస్తే పితృదోషం, శనిదోషం తొలగిపోతుంది
Also Read: అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా, ఉంటే ఏ దిశగా ఉండాలి, ఎన్ని చేపలుండాలి