వైశాఖ పౌర్ణిమకు హిందూమతంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు బుద్ధుడి రూపంలో అవతరించాడని చెబుతారు. వైశాఖ పౌర్ణమి రోజు సిద్దార్థుడు జన్మించడం, అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారడం వల్ల ఇది బుద్ధ పౌర్ణమి అయిందని, ఆధ్యాత్మిక సాధకులకు, జ్ఞాన ప్రాప్తి పొందేవారికి, సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని చెబుతారు. వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువు ఆరాధించి పూజించడంతో పాటు సంపత్ గౌరీ వ్రతాన్ని ఆచరించడం విశేషం. ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. సంపదలు కలగాలనే కోరికతో ప్రతి మహిళ పసుపుతో గౌరీదేవిని చేసి పూజించి, ఆ పసుపు గౌరీదేవిని ముత్తైదువుకు వాయనం ఇవ్వడం ఈ వ్రతం విశేషం. అలాగే, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, గౌరీదేవిని పూజించడం, సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం, అన్నమాచార్యుల వారిని, బుద్ధుడిని, కూర్మావతారంలో ఉన్న మహావిష్ణువును పూజించండం విశేషం.
- పూజ అనంతరం దానం చేయడం అత్యుత్తమం...వైశాఖ పౌర్ణిమి రోజు నీళ్లతో నిండిన కుండ, చెప్పులు, భోజనం, పండ్లు , విసనికర్ర దానం చేయడం మంచిది
- పితృదోషం ఉందని బాధపడేవారు వైశాఖ పౌర్ణిమ రోజు రావిచెట్టుకు నల్ల నువ్వులు కలిపిన నీటిని అభిషేకం చేయాలి. దాంతో పితృదోషం పోతుంది
- శనిదోషంతో ఇబ్బందిపడేవారు రావిచెట్టుకు పూజ చేయడం ద్వారా శనిదోషంతో చాలా సమస్యలు పరిష్కారమవుతాయి
- రావిచెట్టు వద్ద పాలు,నీటితో అభిషేకం చేస్తే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది, సంపద ప్రాప్రిస్తుంది
Also Read: అప్పులు,కష్టాలు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యం తొలగిపోవాలంటే ఈ తిథుల్లో ఇలా చేయండి
ఏడాదిలో ప్రధానమైన రుతువులు రెండు... ఒకటి వసంత ఋతువు, రెండు శరదృతువు
వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాల్లో వస్తుంది. శరదృతువు ఆశ్వయుజ , కార్తీక మాసాల్లో వస్తుంది. ఈ రెండు ఋతువుల్లోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు ఋతువుల్లో శరన్నవరాత్రులు , వసంత నవరాత్రులు చేస్తారు. ఇన్ని ప్రత్యేకతలు ఉండటం వల్లనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రెండు ఋతువుల్లో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి
1. చైత్ర పూర్ణిమ 2. వైశాఖ పూర్ణిమ 3. ఆశ్వయుజ పూర్ణిమ 4.కార్తిక పూర్ణిమ
ఈ నాలుగు పూర్ణిమల్లో ప్రత్యేకమైన ఆరాధనలు చేస్తే సంపూర్ణమైన యజ్ఞఫలాన్ని పొందవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి.
Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే
Also Read: ఇంటి ద్వారాన్ని 16 విధాలుగా నిర్మించవచ్చు... ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి